BigTV English

Rescue Therapy : అప్పుడే పుట్టిన పిల్లలో ఆరోగ్య సమస్య.. రెస్క్యూ థెరపీనే మార్గం..

Rescue Therapy : అప్పుడే పుట్టిన పిల్లలో ఆరోగ్య సమస్య.. రెస్క్యూ థెరపీనే మార్గం..

Rescue Therapy : అప్పుడే పుట్టిన పిల్లలు కూడా హఠాన్మరణానికి గురయిన సందర్భాలు ఎన్నో చూసుంటాం. వారిలో అసలు సమస్య ఏంటి అని తెలుసుకునేలోపే వారు మరణించడంతో వైద్యులు కూడా కొన్నిసార్లు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అప్పుడే పుట్టిన పిల్లలను కాపాడే రెస్క్యూ థెరపీ గురించి శాస్త్రవేత్తలు స్టడీ చేయడం మొదలుపెట్టారు. అసలు ఈ రెస్క్యూ థెరపీ అనేది పిల్లల ప్రాణాలను ఎంతవరకు కాపాడుతుందని తెలుసుకున్నారు.


మామూలుగా అప్పుడే పుట్టిన పిల్లలు ఎక్కువగా చనిపోవడానికి కారణం వారిలో తక్కువ ఆక్సిజన్ లెవల్స్ ఉండడమే అని శాస్త్రవేత్తలు తేల్చారు. అందుకే ఈ సమస్యను పరీక్షించడం కోసం రెస్క్యూ థెరపీని ఉపయోగించాలని వారు చెప్తున్నారు. ప్రతీ 500 పిల్లల్లో ఇలాంటి కండీషన్ కనిపిస్తుందని తెలిపారు. పిల్లల్లో ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని తెలుసుకోవడానికి సూచనగా వారు బ్లూ కలర్‌లో మారుతారని అన్నారు. దీనిని పర్సిస్టెంట్ పల్మొనరీ హైపర్‌టెన్షన్ (పీపీహెచ్ఎన్) అంటారని తెలిపారు.

పీపీహెచ్ఎన్‌తో డిటెక్ట్ అయిన పిల్లలు ఇంకే ఇతర చికిత్సలకు స్పందించకపోతే వారికి వాసోప్రెస్సిన్ చేయడం బెటర్ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మామూలుగా ఇప్పుడు వైద్యులు పీపీహెచ్ఎన్ ఉన్న పిల్లలను హై ఫ్రీక్వెన్సీ వెంటిలేటర్‌కు తరలించి అక్కడ చికిత్సను అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ఈ వెంటిలేటర్ ప్రక్రియ అనేది అందరి పిల్లల ప్రాణాలను కాపాడలేకపోతోంది. మామూలుగా అప్పుడే పుట్టిన పిల్లలు బయట ప్రపంచంలోకి అడుగు పెట్టగానే పీపీహెచ్ఎన్ లాంటి సమస్య కామన్‌గా కనిపిస్తుందని వైద్యులు బయటపెట్టారు.


పిల్లలు తల్లి గర్భంలో ఉన్నంత కాలం వారి లంగ్స్‌కు ఎటువంటి పని ఉండదు. కానీ వారు బయటికి రాగానే వారి లంగ్స్ వెంటనే పని మొదలుపెట్టవలసి ఉంటుంది. అలా చేయలేనప్పుడే పీపీహెచ్ఎన్‌కు కారణమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది పుట్టిన నిమిషం దగ్గర నుండి దాదాపు ఆరు గంటల వరకు ఉండే కండీషన్ అని అన్నారు. అందుకే వెంటిలేటర్ ట్రీట్మెంట్ కంటే వాసోప్రెస్సిన్ అనే రెస్క్యూ థెరపీ పిల్లలకు తొందరగా కోలుకునేలా చేస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×