Virender Sehwag on Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా కెప్టెన్ గా, బీసీసీఐ పెద్దన్నగా సౌరవ్ గంగూలీ పనిచేశాడు. 2000 నుంచి 2005 అంటే ఐదు సంవత్సరాల పాటు టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నారు సౌరవ్ గంగూలీ. వరల్డ్ కప్ టీమిండియా కు అందించకపోయినా.. సౌరవ్ గంగూలీకి తన కెప్టెన్సీ కాలంలో మంచి పేరు వచ్చింది. ఎంతోమంది క్రికెటర్లను అతని కెప్టెన్సీ లోనే తయారు చేశాడు. అలాంటి దాదాపై వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కెప్టెన్ గా ఉన్నప్పుడు సౌరవ్ గంగూలీని తిట్టని ఆటగాడు ఒక్కడు కూడా లేడని పరువు తీశారు వీరేంద్ర సెహ్వాగ్. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని ఉద్దేశించి వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనను తిట్టని టీమిండియా క్రికెటర్ లేడని మొదట బాంబు పేల్చిన వీరేంద్ర సెహ్వాగ్… ఆ తర్వాత మాట మార్చాడు. తాను చేసినా కామెంట్ నిజం కాదని వెల్లడించారు. ఫన్నీగా ఆ వ్యాఖ్యలు చేశానని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు వీరేంద్ర సెహ్వాగ్. కపిల్ దేవ్ నుంచి గిల్, శ్రేయస్ అయ్యర్ వరకు చాలామంది కెప్టెన్లను తాను చూస్తున్నానని వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. కానీ ఇందులో ద బెస్ట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంటూ వ్యాఖ్యానించారు.
టీమిండియాలో క్రికెట్ సభ్యులు అందరూ కెప్టెన్ అంటే భయపడతారని… కెప్టెన్ తో ఏది మాట్లాడినా సీరియస్ గా రియాక్ట్ అవుతారనే వాదన మొదట్లో ఉందని తెలిపారు. అయితే దాదా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అలాంటి వాతావరణాన్ని పూర్తిగా తొలగించాడని వెల్లడించారు. డ్రెస్సింగ్ రూమ్ లో ప్రతి టీమిండియా క్రికెటర్ తో దాదా మాట్లాడేవాడని గుర్తు చేశారు. ఎలాంటి సమస్య ఉన్న దగ్గరుండి చూసుకునేవాడని.. ఎవరి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయలేదన్నారు. దాదా అనే పేరు పెట్టుకున్నప్పటికీ కూడా…. సౌరవ్ గంగూలీ మనసు చాలా పెద్దదని ప్రశంసించారు. దీంతో సౌరవ్ గంగూలీపై వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం టీమిండియా క్రికెట్ పరిస్థితిని చాలా దిగజారేలా చేసింది. అలాంటి క్రమంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని… జట్టును ముందుకు తీసుకువెళ్లాడు. ప్లేయర్ల మధ్య నమ్మకాన్ని అలాగే ఐక్యతను పెంపొందించాడని ఇప్పటికి చెబుతూ ఉంటారు. వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ లాంటి యువ క్రికెటర్లకు అప్పట్లో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడట సౌరవ్ గంగూలీ. దాన్ని అదునుగా చేసుకున్న ఈ క్రికెటర్లు.. టీమిండియాకు వెన్నెముకగా మారారని.. దానికి సౌరవ్ గంగూలీ కారణమని చెబుతూ ఉంటారు.