Basit Ali Reaction On Abhishek Sharma: టీమిండియా వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్ మధ్య జరిగిన 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ నేపథ్యంలో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. తొలి మ్యాచ్ లోనే సెంచరీ మిస్ చేసుకున్న అభిషేక్ శర్మ, రెండో టీ20లో అర్ధ సెంచరీ కొంచంలో చేజార్చుకున్నాడు. అయితే, మూడో టీ20లో మాత్రం అభిషేక్ శర్మ గురి తప్పలేదు. 30 బంతుల్లోనే సెంచరీ బాదేసి, హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ తరుణంలోనే అభిషేక్ శర్మపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అటు మాజీలు కూడా మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఇటీవల గుండెపోటుకు గురైన బాసిత్ అలీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జట్టులోనూ అభిషేక్ శర్మ లాంటి విధ్వంసకర బ్యాటర్ ఉండి ఉంటే బాగుండని వెల్లడించారు. అలాంటి ఆటగాడికి తయారు చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును డిమాండ్ చేశారు. దీంతో బాసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
రెండు రోజుల కిందట 30 బంతుల్లోనే సెంచరీ బాదేసిన అభిషేక్ శర్మను ఉద్దేశించి, బాసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆటగాడని ప్రశంసించారు. ఇలాంటోడు పాకిస్తాన్ జట్టులో ఎందుకు లేడనే బాధ తనకు ఉందని వ్యాఖ్యానించారు. అనవసరంగా అభిషేక్ శర్మ (Abhiseh sharma) స్లాగర్ అంటూ కొంత మంది పాకిస్తాన్ మాజీలు విమర్శలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఫ్లాట్ పిచ్ లపైనే ఆడతాడన్న మాటలు బంద్ చేయండని ఫైర్ అయ్యారు. దమ్ముంటే, అభిషేక్ శర్మ లాంటి విధ్వంసకర లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ను తయారు చేయాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలను డిమాండ్ చేశారు బాసిత్ అలీ.
టీమిండియా డేంజర్ ఓపెనర్ అభిషేక్ శర్మను ఉద్దేశించి పలుగురు మాజీ క్రికెటర్లు తన్వీర్ అహ్మద్, మహ్మద్ అలీ గతంలో విమర్శలు చేశారు. అభిషేక్ శర్మ స్లాగర్ అంటూ హేళన చేశారు. కళ్లు మూసుకుని షాట్లు ఆడతాడని పరువు తీశారు. బ్యాట్ కు తగిలితే సిక్స్, లేకపోతే డకౌట్ అన్నట్లే అభిషేక్ ఆట తీరు ఉంటుందని సెటైర్లు పేల్చారు. అతని బ్యాట్ లోనూ ఏఐ చిప్స్ అమర్చారని కూడా ఆరోపణలు చేశారు. ఇండియన్ ఫ్లాట్ పిచ్ లపై మాత్రమే అభిషేక్ శర్మ ఆడతాడని, విదేశీ మైదానాలపై తేలిపోతాడని పరువు తీశారు. అయితే, తాజాగా బాసిత్ అలీ మాత్రం, అభిషేక్ శర్మను మెచ్చుకోవడం హాట్ టాపిక్ అయింది.