BCCI President : టీమిండియా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఇవాళ ఒక పదవీలో ఉన్న వ్యక్తి రేపు మరో పదవీలో కొనసాగుతున్నాడు. లేదంటే అతను రిటైర్మెంట్ అవుతున్నాడు. లేదంటే తొలగించబడుతున్నాడు. ప్రస్తుతం రాజకీయాలు జరుగుతున్నాయా..? లేక మరేదైనా కారణాల వల్లనో తెలియదు కానీ ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్తితి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. బీసీసీఐ ప్రెసిడెంట్ టీమిండియా మాజీ కెప్టెన్ పేరు వినిపిస్తోంది. ఈ విషయం విని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అక్షరాల సత్యమంట. అయితే బీసీసీఐ ప్రెసిడెంట్ గా మహేంద్ర సింగ్ ధోనీ కి ఆఫర్ వచ్చిందట. కానీ ధోనీ దానిని తిరస్కరించినట్టు సమాచారం.
ప్రస్తుతం ధోనీకి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీసీసీఐ ప్రెసిడెంట్ గా ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జైషానే కొనసాగే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ధోనీకి మహిళల క్రికెట్ టీమ్ కి మెంటార్ గా అవకాశం లభించినట్టు వార్తలు వినిపించాయి. మహిళల వన్డే వరల్డ్ కప్ తో పాటు మెన్స్ టీ-20 వరల్డ్ కప్ కి కూడా మెంటార్ గా రాబోతున్నాడని ఇటీవల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే తాజా వార్తతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. అసలు ధోనీకి బీసీసీఐ ప్రెసిడెంట్ పదవీ ఏందని..? చర్చించుకోవడం విశేషం. టీమిండియా కి మాజీ కెప్టెన్.. మూడు ఐసీసీ టోర్నీలు భారత్ కి అందించిన విక్టరీ కెప్టెన్ ధోనీని టీమిండియా మెంటార్ గా రాబోతున్నాడని వార్తలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా 2026 టీ-20 వరల్డ్ కప్ కంటే ముందే ధోనీకి టీమిండియా మెంటార్ గా ఉండేందుకు బంఫర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.
ధోనీ లాంటి సక్సెస్ ఫుల్ కెప్టెన్ టీమిండియా హెడ్ కోచ్ గా ఉంటే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోందట. అయితే ధోనీ మెంటార్ గా ప్రధాన కోచ్ గంభీర్ ఒప్పుకుంటాడా..? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2011లో బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాస్ చెన్నై సూపర్ కింగ్స్ కి చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే 2013లో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ఇండియా సిమెంట్స్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా ధోనీ నియమితులయ్యారు. మరోవైపు శ్రీనివాసన్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసు తరువాత చెన్నై సూపర్ కింగ్స్ కి చైర్మన్ పదవీ నుంచి తప్పుకున్నాడు. వచ్చే సీజన్ కి మళ్లీ చైర్మన్ గా వ్యవహరించనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ నేపథ్యంలోనే ధోనీకి బీసీసీఐ ప్రెసిడెంట్ పదవీ అని టాక్ రావడంతో శ్రీనివాసన్ ఏదో రాజకీయం ద్వారా ధోనీకి ఆ పదవీ ఇప్పిస్తున్నాడనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ధోనీకి బీసీసీఐ ప్రెసిడెంట్ అనే పదవీ వార్త మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం విశేషం.
A Big Cricketer is in the race to be the next BCCI President. [Abhishek Tripathi]
– If the Cricketer is not ready to take up this position then it could go to some popular Administrator. pic.twitter.com/xZhC8Neqk7
— Johns. (@CricCrazyJohns) September 4, 2025