BigTV English

Prakash Raj Comments on Virat Kohli: విరాట్ కొహ్లీకే.. ప్రకాష్ రాజ్ కౌంటర్!

Prakash Raj Comments on Virat Kohli: విరాట్ కొహ్లీకే.. ప్రకాష్ రాజ్ కౌంటర్!

Actor Prakash Raj Takes Satarical Comments on Virat Kohli: వివాదాలకు ఎప్పుడూ కేరాఫ్ అడ్రస్ గా నిలిచే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. నిజానికి  సిద్ధాంతాల పరంగా బీజేపీ పార్టీకి ఆయన బద్ద విరోధిగా మారిపోయారు. ఇదిలా ఉంటే, ఇప్పుడాయన  పోయి పోయి.. విరాట్ కొహ్లీని ఒక వివాదంలోకి లాగారు. ఇప్పుడదే నెట్టింట పెద్ద చర్చగా మారిపోయింది.


విషయం ఏమిటంటే.. ఐసీసీ అధ్యక్షుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనిపై పలువురు ప్రముఖ క్రికెటర్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇలా ఎందరో ఉన్నారు.

అయితే, విరాట్ కొహ్లీ కూడా తన ధర్మంగా జైషాకు శుభాకంక్షలు చెబుతూ ‘మీ ప్రయాణం విజయవంతమవ్వాలి’.. అని కోరాడు. అయితే విరాట్ కొహ్లీకి దాదాపు 65 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొహ్లీ అలా పోస్ట్ పెట్టగానే.. వెంటనే 3.3 మిలియన్ల మంది చూసేశారు. దాంతో అది వైరల్ అయిపోయింది. అంతేకాదు.. పనిలో పనిగా కొహ్లీ అభిమానులు కూడా జైషాకి అభినందనలు తెలిపారు.


ఇక్కడే మన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే విరాట్ కొహ్లీ పెట్టిన పోస్ట్ ను షేర్ చేస్తూ.. ఒక కోటేషన్ రాశాడు. అదేమిటంటే.. భారత లెజండరీ క్రికెటర్, టీమ్ ఇండియా వెన్నుముక, అన్నింటికి మించి అల్టిమేట్ ఆల్ రౌండర్.. తను అభినందనలు చెప్పినట్టుగానే.. ఐసీసీ అధ్యక్షుడిగా పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు స్టాండింగ్ ఒవేషన్ ఇద్దాం.. అంటూ తనదైన స్టయిల్ లో పంచ్ వేశారు.

Also Read: లెజండ్స్ లీగ్ లో.. దినేశ్ కార్తీక్, శిఖర్ ధావన్

అయితే దీనిపై విరాట్ స్పందించలేదు కానీ, అభిమానులు మాత్రం రయ్ రయ్ మంటూ ప్రకాష్ రాజ్ పై లేచారు. మీరు ఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన జైషా ను చూసి గర్వపడాలి కానీ, వ్యంగ్యంగా పంచ్ లు వేయడం సరికాదు.. అంటూ రాసుకొచ్చారు. కొహ్లీ పోస్ట్ పెట్టగానే అంతమంది చూశారనే అక్కసుతో తనపై సెటైర్లు వేస్తున్నారని రాశారు. కొందరేమో 2019 లోక్ సభ ఎన్నికల్లో మీకు వచ్చిన ఓట్లకు కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాల్సిందే.. అంటూ పంచ్ లు వేశారు.

మొత్తానికి తనకి బీజేపీ అంటే ఇష్టం లేదు కాబట్టి, రాజకీయాల్లో లేని జైషాపై పంచ్ లు వేయడం సరికాదని కొందరు కామెంట్ చేస్తున్నారు. అదీకాక బీసీసీఐ కార్యదర్శిగా భారత క్రికెట్ కు  జై షా ఎంతో చేశాడని, సమర్థుడని కొనియాడారు.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×