BigTV English
Advertisement

Ajay Jadeja: ఒక్క రాత్రికే కోహ్లీ సంపాదనను దాటేసిన క్రికెటర్‌..ఎవరా మొనగాడు!

Ajay Jadeja: ఒక్క రాత్రికే కోహ్లీ సంపాదనను దాటేసిన క్రికెటర్‌..ఎవరా మొనగాడు!

Ajay Jadeja: విరాట్ కోహ్లీ ( Virat Kohli ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా అలాగే సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఎదిగాడు విరాట్ కోహ్లీ. అదే సమయంలో ఏ ప్లేయర్కు లేని ఆస్తులు విరాట్ కోహ్లీకి ఉన్నాయి. టీమిండియాలో అత్యంత ధనవంతుడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ కి  ( Virat Kohli )సాలరీ, మ్యాచ్ ఫీజులు అలాగే ఐపీఎల్… అదే సమయంలో టాప్ బ్రాండ్ల ద్వారా వచ్చే అడ్వర్టైజ్మెంట్ ఫీజులు… ఇలా ఎన్నో వస్తాయి.


Ajay Jadeja Surpasses Virat Kohli As India’s Richest Cricketer After Royal Throne Ascension

ఈ తరుణంలోనే అత్యంత ధనవంతుడిగా ఇండియాలో… క్రికెటర్లలో నిలిచాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ). అయితే అలాంటి విరాట్ కోహ్లీని ఒక్కరోజులోనే…. బీట్ చేశాడు టీం ఇండియా మ్యాజిక్ క్రికెటర్. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అతను ఎవరో కాదు భారత మాజీ బ్యాటర్ అజయ్ జడేజా. 53 సంవత్సరాల టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ అజయ్ జడేజా… రాత్రికి రాత్రి సంపన్నుడిగా మారిపోయాడు. విరాట్ కోహ్లీ ఆస్తులను బీట్ చేసి… ఇప్పుడు నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు అజయ్ జడేజా (Ajay Jadeja ) .

Also Read: IND vs NZ 2024 Test Series: రేపటి నుంచే టెస్టు సిరీస్… హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?


అయితే ఇది ఆయన సొంతంగా సంపాదించింది కాదు. తన వంశం ద్వారా లభించింది. మొన్న దసరా పండుగ అయిన సంగతి తెలిసిందే. ఈ దసరా సందర్భంగా జాంనగర్ రాజకుటుంబం… టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను వారసుడిగా… ప్రకటించడం జరిగింది. జామ్ నగర్ కు కొత్త పేరు నవా నగర్. అయితే ఈ సంస్థానానికి మహారాజుగా అజయ్ జడజాను (Ajay Jadeja ) ప్రకటించారు.

వాస్తవంగా ప్రస్తుతానికి.. జాన్ సాహెబ్ శత్రు సల్య సింహ్ జీ దిగ్విజయ్‌ సింహ్ జి… అజయ్ జడేజాను వారసుడిగా ప్రకటించడం జరిగింది. ఈ తరుణంలోనే మరో రెండు రోజుల్లో నవా నగర్ మహారాజుగా.. అధికారాన్ని స్వీకరించబోతున్నారు అజయ్ జడేజా. ఆయన అధికారాన్ని చేపట్టిన తర్వాత జడేజా ఆస్తులు.. 1450 కోట్లు అవుతాయి. అటు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ప్రస్తుత ఆస్తి 1000 కోట్లు మాత్రమే. ఈ లెక్కన చూసుకున్నట్లయితే టీమిండియా క్రికెటర్లలో.. అత్యంత ధనికుడిగా… అజయ్ జడేజా (Ajay Jadeja ) … నిలుస్తారు.

ఇది ఇలా ఉండగా అజయ్ జడేజా తన కెరీర్ లో 1992 నుంచి 2000 సంవత్సరం వరకు.. తన కెరీర్ టీమ్ ఇండియా తరఫున కొనసాగించాడు. ఈ సుదీర్ఘ ఎనిమిది సంవత్సరాల కెరీర్లో…. 15 టెస్టులు ఆడాడు అజయ్ జడేజా. అలాగే 196 వన్డేలలో… టీమ్ ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అలాగే ఆరు సెంచరీలు 36వ సెంచరీలతో 6000కు పైకి ఆ పరుగులు చేయడం జరిగింది. ఆ తర్వాత టీమ్ ఇండియాలో ఛాన్సులు రాకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించాడు అజయ్ జడేజా. అప్పటినుంచి అప్పుడప్పుడు కామెంట్రేటర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.

Related News

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Cricket players : ఇప్ప‌టి క్రికెట‌ర్లు ఆ వైట్ క్రీమ్ ను ఎందుకు వాడ‌టం లేదో తెలుసా..?

IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?

Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్‌ సిక్సెస్ 2025 విజేత‌గా పాకిస్తాన్..6వ సారి ట్రోఫీ, ప్రైజ్ మ‌నీ ఎంతంటే

IPL 2026: సంజు ఎఫెక్ట్‌..జ‌డేజా అకౌంట్ పై బ్యాక్‌, ఐపీఎల్ 2026కు ముందే సంచ‌ల‌నం !

Big Stories

×