BigTV English

Omar Abdullah CM Oath: జమ్ము కశ్మీర్ సిఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం.. ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటి నుంచే మద్దతు!

Omar Abdullah CM Oath: జమ్ము కశ్మీర్ సిఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం.. ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటి నుంచే మద్దతు!

Omar Abdullah CM Oath| కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫెరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా బుధవారం రాజధాని శ్రీనగర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. జమ్ము కశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఒమర్ అబ్దుల్లా చేత ప్రమాణ స్వీకారం చేయించారు.


జమ్ము కశ్మీర్ ప్రత్యేక రాష్ట్రంగా హోదా కోల్పోయిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో నేషనల్ కాన్ఫెరెన్స్ విజయం సాధించింది. ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే,  సమాజ్ వాది పార్టీ నాయకుడు అఖిలేఖ్ యాదవ్, ఎన్ సీపీ నాయకురాలు సుప్రియ సూలే, తమిళనాడు డిఎంకే నాయకురాలు కనిమొళి ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ఒమర్ అబ్దుల్లాతోపాటు 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

2009 -2014 వరకు జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన 54 ఏళ్ల ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత హజ్రత్ బల్ ప్రాంతానికి వెళ్లి నేషనల్ కాన్ఫెరెన్స్ పార్టీ వ్యవస్థాపకుడు, తన తాత షేక్ మొహమ్మద్ అబ్దుల్లా సమాధికి నివాళి అర్పించారు.


Also Read: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. సింగపూర్ ఎయిర్ పోర్ట్ లో హై టెన్షన్

అయితే ఇండియా కూటమిలో భాగంగా ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన నేషనల్ కాన్ఫెరెన్స్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ఏకాభిప్రాయం కుదురలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగం కాకూడదని.. బయటి నుంచి మద్దతు నివ్వాలని నిర్ణయించింది. జమ్ము కశ్మీర్ రాష్ట్ర కేబినెట్ లో కాంగ్రెస్ పార్టీ మూడు మంత్రి పదువులు డిమాండ్ చేయగా.. నేషనల్ కాన్ఫెరెన్స్ కేవలం ఒక్క సీటు మాత్రమే ఇచ్చేందకు అంగీకరించింది. కానీ కాంగ్రెస్ ఈ ఆఫర్ ని తిరస్కరించిందని సమాచారం.

2019లో జమ్ము కశ్మీర్ లో ఆర్టికల్ 370ని కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం రద్దు చేసిన తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి మొత్తం 90 సీట్లలో పోటీ చేసింది. మూడు దశల్లో జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలైన నేషనల్ కాన్ఫెరెన్స్, కాంగ్రెస్ లకు 48 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ కేవలం 6 సీట్లలో విజయం సాధించగా.. నేషనల్ కాన్ఫెరెన్స్ 42 సీట్లు గెలుచుకోవడం విశేషం.

Also Read:  ‘ప్రభుత్వ ఉద్యోగం ఉంది, వధువు కావలెను’.. 50 మహిళలను మోసం చేసిన ముగ్గురు పిల్లల తండ్రి!

అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు దూరంగా ఉండడంపై మీడియా ప్రతినిధులు నూతన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. 2019 తరువాత కశ్మీర్ లో మునుపటి పరిస్థితులు లేవని.. ఆర్టికర్ 370 రద్దుకు ముందు కశ్మీర్ రాష్రంలో 40-45 మంత్రులు ఉండేవారని.. కానీ ప్రస్తుతం 9 మంది మంత్రలకే చోటు ఉందని అన్నారు. అయినా కాంగ్రెస్ తో ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో తమకు మంచి సంబందాలున్నాయని లేకపోతే రాహుల్ గాంధీ, ఖర్గే లాంటి నాయకులు తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే వారు కాదని అన్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×