BigTV English

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

New captains for these 5 teams next season Over IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం ఇప్పటి నుంచే రంగం సిద్ధమవుతోంది. ఈ మెగా టోర్నీ కోసం ఈ ఏడాది చివర్లో మెగా వేలం నిర్వహించనుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు 10 జట్ల ఓనర్లతో సమావేశం కూడా నిర్వహించింది బీసీసీఐ. అయితే ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్ సీజన్లో.. ఐదు జట్ల కెప్టెన్లు మారబోతున్నారని వార్తలు వస్తున్నాయి.


హైదరాబాద్  SRH: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… ఈ ఏడాది ఐపిఎల్ లో ఫైనల్లో ఓడిపోయింది. అయితే వచ్చే సీజన్లో కచ్చితంగా కప్ గెలవాలని ఆలోచన చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో వచ్చే సీజన్ కోసం కొత్త కెప్టెన్ రెడీ చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ ఓపెనర్ హెడ్ ను పాట్ కమిన్స్ స్థానంలో నియమించాలని కావ్య పాపా డిసైడ్ అయ్యారట.

ముంబై ఇండియన్స్ : ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారయింది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడంతో… 2024 సీజన్లో ఆ జట్టు దారుణంగా… విఫలమైంది. అయితే ఈసారి మాత్రం అలాంటి మిస్టేక్స్ చేయకూడదని ముంబై యాజమాన్యం అనుకుంటోందట. అందుకే హార్దిక్ పాండ్యా స్థానంలో… సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.


New captains for these 5 teams next season Over IPL 2025

లక్నో సూపర్ జెంట్స్ : లక్నో కు కూడా ఈసారి కొత్త కెప్టెన్ రాబోతున్నట్లు సమాచారం అందుతోంది. గత సీజన్లో.. లక్నో జట్టు అత్యంత దారుణ ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు చేతిలో లక్నో ఓడిపోవడం… కారణంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ను.. ఓనర్ సంజయ్ బహిరంగంగానే తిట్టారు. దీంతో లక్నో ను వదిలి ఆర్సిబిలోకి.. రాహుల్ వెళ్లనున్నట్లు సమాచారం. రాహుల్ స్థానంలో రోహిత్ శర్మను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారట. అదే జరిగితే లక్నోకు రోహిత్ శర్మ కెప్టెన్ అవుతారు.

Also Read: Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : మొన్నటి వరకు కెప్టెన్ గా ఉన్న డూప్లిసిస్.. తన ఏజ్ నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ కు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. అతని స్థానంలో కేఎల్ రాహుల్ ను ఆర్సిబి లోకి తీసుకొని కెప్టెన్ చేయాలని అనుకుంటున్నారు. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన అనుభవం రాహుల్ కు బాగానే ఉంది.

పంజాబ్ కింగ్స్ : పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా ప్రస్తుతం ధావన్ ఉన్నాడు. అయితే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు ధావన్ రిటైర్మెంట్ ఇచ్చాడు. మళ్లీ పంజాబ్ కెప్టెన్ గా ఆయన కొనసాగడం కష్టమే అని తెలుస్తోంది. అందుకే ధావన్ స్థానంలో రోహిత్ శర్మ లాంటి ప్లేయర్ ను కొనుగోలు చేయాలని ప్రీతి జింటా ప్రయత్నాలు చేస్తున్నారట. ఒకవేళ రోహిత్ శర్మ పంజాబ్ లోకి వస్తే ఆయన కెప్టెన్ అవుతారని సమాచారం.

 

 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×