Pakistan Cricket Board: పాకిస్తాన్ క్రికెట్ అంటే పెద్ద జోక్ గా మారిపోయింది. ఆ జట్టులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కోచ్ లు, కెప్టెన్లను వరుసగా మార్చడమే కాకుండా, సరికొత్త ప్రయోగాలు చేస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నవ్వుల పాలు అవుతూ ఉంటుంది. అయితే, అలాంటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు రోడ్డున పడే ప్రమాదం వచ్చి పడింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు వచ్చే ఆదాయం అమాంతం పడినట్టు నివేదికలు చెబుతున్నాయి. వాళ్లకు వచ్చే అదాయం గతేడాదితో పోల్చితే 500 శాతం పడిపోయినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, పాకిస్తాన్ ప్లేయర్లు అడుక్కు తినాల్సిందేనని చర్చ మొదలైంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా ఉందని చర్చ నడుస్తోంది. 2025-2026 సంవత్సరపు ఆదాయం భారీగా తగ్గినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ముగిసే సమయానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదాయం రూ. 511 ( PKR 16.88 Billion
) అని తెలుస్తోంది. అదే సమయంలో బోర్డు ఖర్చులు రూ.510 కోట్లుగా ( PKR 16.85 Billion) ఉన్నట్టు సమాచారం. అన్ని ఖర్చులు పోగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కేవలం రూ.3 కోట్లు మిగులుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. కిందటి ఏడాది అంటే 2024-25లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు రూ.18 కోట్ల ఆదాయం వచ్చిందట. 2024లో రూ.20.28 కోట్ల ఆదాయం వచ్చిందని అంటున్నారు. అంటే ప్రతీ ఏడాది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదాయం క్రమ క్రమంగా తగ్గుతోందని తెలుస్తోంది. ఈ లెక్కన కిందటి ఏడాదితో పోల్చితే పాకిస్తాన్ కు 500 శాతం అదాయం తగ్గినట్టు చెబుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే, పాక్ ప్లేయర్లు రోడ్డున పడటం గ్యారెంటీ అంటూ పోస్టులు పెడుతున్నారు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదాయం తగ్గడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 2026లో పాకిస్తాన్ లో ఉన్న చాలా స్టేడియాలను రిపేర్ చేసింది పీసీబీ. లాహోర్ గడాఫీ స్టేడియం, రావల్పిండి, కరాచీ మైదానాలను ఈ ఏడాది భారీ ఎత్తున ఖర్చు చేసి, అప్డేట్ చేశారు. అలాగే పాకిస్తాన్ ప్లేయర్ల ఫిట్ నెస్, ప్రదర్శన మెరుగుపడేందుకు కూడా ఖర్చు చేసింది. అంతేకానీ పాకిస్తాన్ వృధాగా ఒక్క రూపాయి అదనంగా ఖర్చు చేయలేదు. ఈ ఏడాది ఆదాయం తగ్గినా, 2027 వరల్డ్ కప్ లోపు పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. అనవసరంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దని పీసీబీ పెద్దలు హెచ్చరిస్తున్నారు.