Cristiano Ronaldo Retirement: క్రిస్టియానో రొనాల్డో సంచలన ప్రకటన చేశాడు. తన అంతర్జాతీయ ఫుట్ బాల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తే అందరికీ షాక్ ఇచ్చాడు. తన వ్యక్తిగత కారణాలతో ఈ రిటైర్మెంట్ తీసుకున్నట్టు వెల్లడించాడు. క్రిస్టియానో రొనాల్డో చేసిన ఈ ప్రకటన నేపథ్యంలో అతని 23 ఏళ్ల సుదీర్ఘ ఫుట్ బాల్ ప్రయాణం ముగిసింది. తన ప్రయాణంలో సపోర్ట్ చేసిన వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. పోర్చుగల్ జాతీయ జట్టు కోచ్ జార్జ్ జీసెస్ తో విభేధాలు ఉన్న తరుణంలోనే క్రిస్టియానో రొనాల్డో రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అంతర్జాతీయ ఫుట్ బాల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో ఆస్తుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం క్రిస్టియానో రొనాల్డో నికర ఆస్తి విలువ రూ.12000 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అతని కెరీర్ మొత్తం సంపాదన రూ. 25000 కోట్లకు పై మాటే అనే చర్చ నడుస్తోంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే ఆటగాడికి క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇతను ఒక్క మ్యాచ్ కు రూ.30 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. రోజుకు రూ.6 కోట్లు సంపాదిస్తున్నాడట. క్రిస్టియానో రొనాల్డో విల్లాల విషయానికి వస్తే, అతనికి 1500 కోట్ల విలువైన లగ్జరీ ఇండ్లు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. పోర్చుగల్ రాజధానిలో రూ.70 కోట్ల విలువైన ఫ్లాట్, లాఫింకాలో రూ.60 కోట్ల విలువైన భవనం ఉంది. క్వింటా డా మారిన్హాలో రూ.290 కోట్ల విలువైన డ్రీమ్ మాన్షన్ కూడా ఉంది. దీన్ని ఇటీవలే నిర్మించాడు. సౌదీ అరేబియాలో రూ.150 కోట్ల ప్యాలెస్ కూడా ఉంది. న్యూయార్క్ ట్రంప్ టవర్ లో రూ.200 కోట్ల అపార్ట్ మెంట్, ఇటలీలో విల్లా, మార్చెల్లాలో హాలిడే ట్రిప్పులకు బంగ్లా ఉంది.
క్రిస్టియానో రొనాల్డో దగ్గర ఆస్తులు, అంతస్తులే కాకుండా ప్రత్యేక విమానాలు కూడా ఉన్నాయి. రూ.1100 కోట్లతో రెండు స్పెషల్ జెట్లు కొనుగోలు చేశాడు. ఏ దేశానికైనా వీటిలో ప్రయాణిస్తాడు. ఇందులో గల్ఫ్ స్ట్రీమ్ జీ650 ఒకటి. దీని విలువ రూ.610 కోట్లకుపైగా ఉంది. గల్ఫ్ స్ట్రీమ్ జీ650 జెట్స్ కేవలం ప్రపంచంలో ఉన్న అతి కొద్ది సంపన్నుల దగ్గర మాత్రమే ఉంది. బొంబార్డియర్ గ్లోబర్ ఎక్స్ ప్రెస్ ఎక్స్ఆర్ఎస్ ను 2024లో దాదాపు రూ.500 కోట్లతో కొనుగోలు చేశాడు. సౌదీ అరేబియా, యూరప్ మధ్య ప్రయాణాలకు మాత్రమే దీన్ని క్రిస్టియానో రొనాల్డో వాడుతాడు.