E-Paper
Advertisement

రజత్ పాటిదర్ కెప్టెన్ గా పనికేరాడు..కానీ రెండు టైటిల్స్ తెచ్చాడు!

రజత్ పాటిదర్ కెప్టెన్ గా పనికేరాడు..కానీ రెండు టైటిల్స్ తెచ్చాడు!
Advertisement

Venkatesh Iyer On Rajat Patidar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ వేలం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటిదర్ పై ఆ జట్టు ఆటగాడు వెంకటేష్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. రజత్ పాటిదర్ ఒక సాధారణ ప్లేయరే… కానీ ఓవర్ నైట్ గా స్టార్ అయిపోయాడని వెల్లడించాడు. అతనితో తనకు మొదటి నుంచి పరిచయం ఉందని..అతన్ని ఎప్పుడు కూడా తాను కెప్టెన్ గా ఊహించుకోలేదని గుర్తు చేశాడు. అలాంటోడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ చేయడంతో షాక్ అయినట్టు వివరించాడు. ఈ క్రమంలో బెంగుళూరు జట్టును నడపడం రజత్ పాటిదర్ వల్ల కాదని, తన మనసులో అనుకున్నట్టు షాకింగ్ నిజాలను బయట పెట్టాడు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును 18 సంవత్సరాల తర్వాత విజేతగా నిలిపాడని ప్రశంసించాడు. దీంతో అప్పటి నుంచి రజత్ పాటిదర్ అంటే తనకు గౌరవం పెరిగిందని వివరించాడు. ఇప్పుడు అతనికి తాను ఫ్యాన్ అయిపోయానని వెంకటేష్ అయ్యర్ స్పష్టం చేశాడు.

హ్యాట్రిక్ టైటిల్ కచ్చితంగా అందిస్తాడు

రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు కెప్టెన్ గా ఉన్న రజత్ పాటిదర్  పై వెంకటేష్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు సాధారణ కుటుంబం నుంచి వచ్చినా కూడా ఉన్నత స్థాయికి ఎదిగాడని.. అలాంటి వాళ్లు క్రికెట్ లో అరుదుగా ఉంటారని వెల్లడించాడు. అతని కెప్టెన్సీలో ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండు టైటిల్స్ గెలిచిందని.. 2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సందర్భంగా కూడా మరో టైటిల్ అందుకోబోతోందని స్టేట్మెంట్ ఇచ్చాడు. అతని కెప్టెన్సీలోనే హ్యాట్రిక్ టైటిల్ కొట్టడం గ్యారంటీ అని పేర్కొన్నాడు వెంకటేష్ అయ్యర్. విరాట్ కోహ్లీ సలహాలు తీసుకుంటూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడని ప్రశంసించాడు. కెప్టెన్ గా ఉన్న వ్యక్తి కాస్త మెల్లగా ఆడతాడని..కానీ రజత్ పాటిదర్ అస్సలు వెనుకడుగు వేయకుండా దూకుడుగా ఆడడం గ్రేట్ అన్నాడు. ఇలాంటి కెప్టెన్లు ఉన్న జట్టు కచ్చితంగా సక్సెస్ అవుతుందని స్పష్టం చేశాడు. దీంతో రజత్ పాటిదర్ పై వెంకటేష్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

టీమిండియా-ఏ జట్టు వైస్ కెప్టెన్ గా రజత్ పాటిదర్

రెండుసార్లు బెంగళూరు జట్టును ఛాంపియన్ చేసిన రజత్ పాటిదర్ కు టీమిండియా నుంచి పిలుపు రాలేదు. కానీ ఇటీవల ప్రకటించిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా జూనియర్ జట్టును ప్రకటించారు. ఈ జూనియర్ టీమిండియా జట్టుకు తిలక్ వర్మను కెప్టెన్ చేయగా, రజత్ పాటిదర్  ను వైస్ కెప్టెన్ గా చేసింది బీసీసీఐ. ఇందులో అద్భుతంగా రాణిస్తే టీమిండియా సీనియర్ల జట్టులోకి కచ్చితంగా రజత్ పాటిదర్ వస్తాడని అంటున్నారు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

 

Related News

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బిగ్ షాక్…500 శాతం పడిపోయిన ఆదాయం?

ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రొనాల్డో ఆస్తులు ఎన్ని కోట్లంటే? రెండు ప్రైవేట్ జెట్స్

కావ్య పాప స్కెచ్ అదుర్స్…రంగంలోకి మరో ఇద్దరు బౌలర్లు, ఇక SRHను చూస్తేనే తడిచిపోవాలి

ముంబై జ‌ట్టులో హార్దిక్ పాండ్యాను ఏకాకిని చేశారు..తెర‌వెనుక‌ రోహితే కుట్ర‌లు చేశాడు!

మ‌హ్మ‌ద్ అమీర్ దూల తీర్చిన మొహ్సిన్ న‌ఖ్వీ..ఐపీఎలే కాదు, PSL ఆడ‌కుండా బ్యాన్ ?

అల్లా మీద ఒట్టు, వైభ‌వ్, అభిషేక్ ల‌ను పాకిస్తాన్ త‌ట్టుకోలేదు…50 ఓవ‌ర్ల‌లో 600 కొడ‌తారు

BBL తొలి మ్యాచ్..ఇండియాను అవ‌మానించిన ముస్తాఫిజుర్…సెఫ్టీ లేదంటూ కామెంట్స్‌!

Big Stories

Advertisement
×