Subramaniam Badrinath On Mumbai Indians: 2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (2027 Indian Premier League tournament) వేలం డిసెంబర్ 16వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో రిటెన్షన్ అలాగే రిలీజ్ లిస్ట్ పై 10 ఫ్రాంచైజీలు ఫోకస్ చేశాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యాను ( Hardik Pandya) తీసుకునేందుకు చాలా జట్లు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇలాంటి క్రమంలో హార్దిక్ పాండ్యా ఎపిసోడ్ పై మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ (Subramaniam Badrinath) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా ముంబై జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆ జట్టులో చీలిక వచ్చిందని బాంబు పేల్చాడు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా అంగీకరించని కొంత మంది ప్లేయర్లు… అతని మాట కూడా వినలేదని ఫైర్ అయ్యాడు.
అతని కెప్టెన్సీపై మరక వేయాలని అందరూ కలిసి కుట్రలు చేశాడని సుబ్రమణ్యం బద్రీనాథ్ విమర్శలు చేశాడు. అందుకే గత రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిందని పేర్కొన్నాడు. మొత్తానికి హార్దిక్ పాండ్యాను విలన్ గా ముద్రించి అతడిని బయటకు పంపిస్తున్నారని బాంబు పేల్చాడు. దీని అంతటి వెనుక రోహిత్ శర్మ గ్యాంగ్ ఉందని తనకు అనుమానం ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. సూర్య కుమార్ యాదవ్ బుమ్రా, తిలక్ వర్మ అందరూ కలిసి రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని ముంబై యాజమాన్యాన్ని చాలా సార్లు కోరినట్టు కూడా ఆయన ఆరోపణలు చేశాడు. రోహిత్ శర్మలో విషం నింపి, హార్ధిక్ పాండ్యాపైకి ఉలిగొల్పారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అన్ని కుట్రలు చేసి, ముంబై జట్టులో హార్దిక్ పాండ్యాను ఏకాకిని చేశారని మండిపడ్డాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై నుంచి హార్దిక్ పాండ్యా బయటకు వెళ్లడం దాదాపు ఖరారు అయినట్టే తెలుస్తోంది. అయితే అతని కోసం ముందు నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ జట్లు గట్టిగానే పోటీ పడ్డాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరిందట. దీని ప్రకారం ముంబైలోకి అర్ష్ దీప్ సింగ్… పంజాబ్ కింగ్స్ లోకి హార్దిక్ పాండ్యా వెళ్తాడని తెలుస్తోంది. రెండు జట్ల మధ్య దీనిపై డీల్ కుదరడంతో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున హార్దిక్ పాండ్యా ఆడతాడని ప్రచారం మొదలైంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా గోవాలో డిసెంబర్ 16వ తేదీన ఐపీఎల్ వేలం జరుగుతుంది. నవంబర్ 17వ తేదీ లోపు రిలీజ్, రిటెన్షన్ లిస్టును ఐపీఎల్ కౌన్సిల్ కు 10 ఫ్రాంచైజీలు అప్పగించాల్సి ఉంటుంది.