E-Paper
Advertisement

కావ్య పాప‌కు కొత్త త‌ల‌నొప్పి…RCBలోకి వెళ్తానంటూ అభిషేక్ శ‌ర్మ బెదిరింపులు?

కావ్య పాప‌కు కొత్త త‌ల‌నొప్పి…RCBలోకి వెళ్తానంటూ అభిషేక్ శ‌ర్మ బెదిరింపులు?
Advertisement

Abhishek Sharma To RCB:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 Tournament) మెగా వేలం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్లేయర్ల ట్రేడింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ట్రేడ్ డీల్ లో భాగంగా ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి (Sunrisers Hyderabad team) ముగ్గురు కొత్త బౌలర్లు వచ్చారు. దీంతో హైదరాబాద్ బౌలింగ్ దళం చాలా బలంగా తయారైంది. ఈ క్ర‌మంలోనే సన్ రైజ‌ర్ హైద‌రాబాద్ యాజమాన్యంతో పాటు అభిమానులు సంబరపడుతున్నారు. ఇంతలోనే అభిషేక్ శర్మ (Abhishek Sharma) అంశం హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాపకు (Kavya Maran) పెద్ద తలనొప్పి వచ్చినట్టు తెలుస్తోంది.

అభిషేక్ శర్మను ట్రేడ్ ద్వారా తీసుకునేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ముందుకు వచ్చినట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అతని కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు బెంగళూరు యాజమాన్యం అడుగులు వేస్తున్నట్టు క‌థ‌నాలు వస్తున్నాయి. అయితే బెంగళూరు ఇంట్రెస్ట్ చూపించడంతో అభిషేక్ శర్మ కూడా వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పెళ్లికి ముందు కావ్య పాపకు కొత్త టెన్షన్ మొదలైంది. మ‌రి అభిషేక్ శ‌ర్మ‌ను ఉంటాడా? లేదా? అనేది త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

రూ.40 కోట్లు ఇస్తేనే ఉంటామంటూ మొండిపట్టు?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2028 మెగా వేలానికి ముందు కొంత మంది టీమిండియా స్టార్ ఆటగాళ్లు తమను రిటెన్షన్ చేసుకోవాలంటే కండిషన్లు పెడుతున్నారట. ఒక్కో ఆటగాడికి రూ.40 కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ గా మారింది. జాతీయ మీడియాలో కూడా ఈ కథనాలు వస్తున్నాయి. 2028 ఐపీఎల్ నాటికి ఒక్కో జట్టు ఆక్షన్ పర్సు రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పెంచ‌నున్న‌ట్టు సమాచారం అందుతోంది.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

Advertisement

దీంతో ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు రూ.40 కోట్లు పెట్టిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నివేదికలు చెబుతున్నాయి. అయితే రూ.40 కోట్లు ఇవ్వాలనే డిమాండ్ పెట్టిన ఆట‌గాళ్ల‌లలో బుమ్రా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్లతో పాటు అభిషేక్ శర్మ ఉన్నట్టు తెలుస్తోంది. రూ. 40 కోట్లు ఇస్తేనే ఉంటామని లేకపోతే వేలానికి వెళ్లడం గ్యారంటీ అంటూ చర్చ నడుస్తోంది.

ఐపీఎల్ 2027 వేలం షెడ్యూల్?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ మెగా వేలం డిసెంబర్ 16వ తేదీన గోవాలో జరగనుంది. దీని కోసం ఇప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు చక చక‌ జరిగిపోతున్నాయి. నవంబర్ 17వ తేదీ లోపు రిటెన్షన్, రిలీజ్ లిస్టును ఐపీఎల్ కౌన్సిల్ కు అప్పగించాలని డెడ్లైన్ కూడా విధించింది బీసీసీఐ. ఇక మెగా టోర్నమెంట్ 2027 మార్చి 10వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు జరుగుతుందని సమాచారం.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

 

 

 

Related News

రజత్ పాటిదర్ కెప్టెన్ గా పనికేరాడు..కానీ రెండు టైటిల్స్ తెచ్చాడు!

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బిగ్ షాక్…500 శాతం పడిపోయిన ఆదాయం?

ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రొనాల్డో ఆస్తులు ఎన్ని కోట్లంటే? రెండు ప్రైవేట్ జెట్స్

కావ్య పాప స్కెచ్ అదుర్స్…రంగంలోకి మరో ఇద్దరు బౌలర్లు, ఇక SRHను చూస్తేనే తడిచిపోవాలి

ముంబై జ‌ట్టులో హార్దిక్ పాండ్యాను ఏకాకిని చేశారు..తెర‌వెనుక‌ రోహితే కుట్ర‌లు చేశాడు!

మ‌హ్మ‌ద్ అమీర్ దూల తీర్చిన మొహ్సిన్ న‌ఖ్వీ..ఐపీఎలే కాదు, PSL ఆడ‌కుండా బ్యాన్ ?

అల్లా మీద ఒట్టు, వైభ‌వ్, అభిషేక్ ల‌ను పాకిస్తాన్ త‌ట్టుకోలేదు…50 ఓవ‌ర్ల‌లో 600 కొడ‌తారు

Big Stories

Advertisement
×