BigTV English

Argentina : మెస్సీ మెరిసె.. అర్జెంటీనా నిలిచె..

Argentina : మెస్సీ మెరిసె.. అర్జెంటీనా నిలిచె..

Argentina : అర్జెంటీనా సాకర్ అభిమానులకు భారీ ఊరట. ఫిఫా వరల్డ్‌కప్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రెచ్చిపోయి ఆడిన అర్జెంటీనా… మెక్సికోపై ఘన విజయం సాధించింది. ప్రీక్వార్టర్స్ ఆశల్ని సజీవంగా నిలుపుకుంది.


గ్రూప్-Cలో భాగంగా సౌదీ అరేబియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా 1-2 గోల్స్ తేడాతో ఓడిపోవడంతో… ఇక ఈ వరల్డ్‌కప్‌లో ఆ జట్టు ముందడుగు వేస్తుందా? అని అభిమానులతో పాటు అంతా అనుకున్నారు. ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి అటూ ఇటూ అయినా… అర్జెంటీనా పనైపోయినట్టేనని భావించారు. కానీ… రెండో మ్యాచ్‌లో అర్జెంటీనా జూలు విదిల్చింది. ఆ జట్టు ఆటగాళ్లు అద్భుతంగా ఆడి మెక్సికోపై 2-0 గోల్స్ తేడాతో తిరుగులేని విజయం సాధించారు.

తొలి అర్థభాగంలో అర్జెంటీనా, మెక్సికో ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయాయి. ముఖ్యంగా మెక్సికో… అర్జెంటీనా ఆటగాళ్లను సమర్థంగా అడ్డుకుని… ఆ జట్టును అసహనానికి గురిచేశారు. గోల్ కోసం ఇరు జట్లు తీవ్ర ప్రయత్నం చేసినా సఫలం కాలేకపోయాయి. దాంతో… సెకండ్ హాఫ్ మరింత హోరాహోరీగా సాగింది. అటాకింగ్ గేమ్ మొదలుపెట్టిన అర్జెంటీనా… మెక్సికోపై ఒత్తిడి పెంచింది. ఆట 64వ నిమిషంలో స్టార్ ఆటగాడు లియోనల్‌ మెస్సీ జట్టుకు తొలి గోల్‌ అందించాడు. మెక్సికో రక్షణ శ్రేణిని, గోల్ కీపర్ ను బోల్తా కొట్టిస్తూ 20 మీటర్ల దూరం నుంచి మెస్సీ రిఫ్టింగ్ ద్వారా బంతిని నేరుగా గోల్ పోస్టులోకి పంపడంతో… అర్జెంటీనా ఆటగాళ్లు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా… 87వ నిమిషంలో సబ్ స్టిట్యూట్ ఆటగాడు ఎంజో ఫెర్నాండేజ్‌ గోల్ పోస్ట్ టాప్ కార్నర్లోకి బంతిని కర్లింగ్ చేస్తూ అద్భుత షాట్ తో గోల్ చేశాడు. దాంతో… 2-0 గోల్స్ తేడాతో ఆధిక్యంలో నిలిచిన అర్జెంటీనా… మెక్సికోపై ఘన విజయం సాధించింది. మెక్సికోపై చేసిన గోల్.. మెస్సీకి ఈ వరల్డ్‌కప్‌లో రెండోది. సౌదీపైనా మెస్సీ ఒక గోల్ చేశాడు. మెక్సికోపై విజయంతో గ్రూప్-Cలో అర్జెంటీనా 3 పాయింట్లతో రెండోస్థానానికి చేరింది. 4 పాయింట్లతో పోలండ్ తొలిస్థానంలో ఉంది. గ్రూప్-Cలో మిగిలిన అతిపెద్ద మ్యాచ్ అర్జెంటీనా-పోలండ్ మధ్యే జరగనుంది. ఆ మ్యాచ్‌ ఫలితాన్ని బట్టి గ్రూప్-C జట్ల ప్రీక్వార్టర్స్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×