E-Paper
Advertisement

Asaduddin Owaisi: సంజు శాంస‌న్ జీసస్ సెల‌బ్రేష‌న్స్‌..వాళ్ల తోలు తీస్తానంటూ ఓవైసీ వార్నింగ్‌

Asaduddin Owaisi: సంజు శాంస‌న్ జీసస్ సెల‌బ్రేష‌న్స్‌..వాళ్ల తోలు తీస్తానంటూ ఓవైసీ వార్నింగ్‌
Advertisement

Asaduddin Owaisi:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) టీమిండియా సెమీ ఫైనల్ కు దూసుకువెళ్లింది. అందరూ ఊహించినట్లుగానే ఆదివారం రోజున వెస్టిండీస్ జట్టును చిత్తు చేసి సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది. సంజు శాంసన్ ( Sanju SAMSON) 97 పరుగులతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా విజయం సాధించింది. అయితే విజయం అనంతరం సంజు శాంసన్ చేసుకున్న సెలబ్రేషన్స్ వివాదంగా మారాయి. జీసస్ ఈ మ్యాచ్ గెలిపించాడు అన్న రేంజ్ లో సంజు శాంసన్ సెలబ్రేషన్స్ ( jesus celebrations) చేసుకున్నాడు. దీనిపై హిందుత్వ వాదులు, బిజెపి నాయకులు సీరియస్ అవుతున్నారు. టీమిండియా తరఫున ఆడుతున్నప్పుడు జీసస్ ( jesus ) ప్రస్తావన ఎందుకు వచ్చిందని నిలదీస్తున్నారు.

Also Read: India vs West Indies: సంజూ ర‌ఫా..ర‌ఫా, వెస్టిండీస్ పై 10 ఏళ్ల రివేంజ్ తీర్చుకున్న టీమిండియా…సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ

సంజు శాంసన్ జీసస్ సెలబ్రేషన్స్.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు

Advertisement

టీమిండియా విజయం అనంతరం సంజు శాంసన్ చేసుకున్న సెలబ్రేషన్స్ పైన విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మ‌జ్లీస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజు శాంసన్ కు సపోర్ట్ గా నిలుస్తూ మాట్లాడారు. టీమిండియాలో అన్ని మతాలకు సంబంధించిన ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నారు. అన్ని మతాలు కలిస్తేనే ఇప్పుడు ఇండియా గెలిచిందని వివరించారు. అలాంటిది ఒక క్రైస్తవ మతస్థుడు మ్యాచ్ గెలిపిస్తే తప్పేముంది.. ? అతడు సెలబ్రేషన్స్ చేసుకుంటే మీకు ఏం అవుతోందని నిలదీశారు. గతంలో క్రైస్తవ మతానికి చెందిన జెమిమా.. అద్భుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చిందన్నారు. ఇప్పుడు సంజు శాంసన్ ( Sanju Samson) ఆ పాత్ర పోషించాడని గుర్తు చేశారు. సంజు ఏ మతస్తుడైన.. మ్యాచ్ మాత్రం ఇండియా కోసం ఆడాడని వెల్లడించారు. అతను వల్లే ఇండియా గెలిచిందని గుర్తు చేశారు ఓవైసీ. ఈ విషయాన్ని పెద్దదిగా చేసి మతాల మధ్య చిచ్చులు పెట్టకూడదని కోరారు.

సంజు, జెమిమా రోడ్రిగ్స్ జీసస్ సెలబ్రేషన్స్ పై విమర్శలు

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా వెస్టిండీస్ పై (WEst Indies) విజయం సాధించిన టీమిండియా ( Team India) సెమీ ఫైనల్ కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన సంజు.. జీసస్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీనిపై హిందూ సంఘాలు అలాగే బిజెపి నేతలు ( Bjp  leaders) సీరియస్ అవుతున్నారు. గతంలో జెమిమా రోడ్రిగ్స్ కూడా ఇలాగే వ్యవహరించింది. 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ సమయంలో కూడా ఓ మ్యాచ్ గెలిచిన తర్వాత అచ్చం ఇలాగే జీసస్ సెలబ్రేషన్స్ చేసుకుంది జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Jessica Rodrigues ). దీనిపై కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి.

Advertisement

Also Read: India vs West Indies: విండీస్ ఫ‌స్ట్ బ్యాటింగ్..ఐసీసీని ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గా మార్చారు…విషం క‌క్కిన పాక్‌

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×