BigTV English

Joe Root: అశ్విన్ క్యారమ్ బాల్స్ వేస్తాడు: జో రూట్

Joe Root: అశ్విన్ క్యారమ్ బాల్స్ వేస్తాడు: జో రూట్
Joe RootJoe Root about aswin: ఎప్పుడు మన ఆటను మనవాళ్లు పొగిడితే అందులో కిక్కేం ఉంది..ప్రత్యర్థులు పొగిడితే అందులో వచ్చే మజాయే వేరబ్బా…అనిపిస్తుంది. అంతే కదా…ప్రస్తుతం ఇండియా-ఇంగ్లాండ్ మధ్య సుదీర్ఘ సిరీస్ లో ఆఖరి టెస్ట్ మ్యాచ్ కు ధర్మశాల సిద్ధమైంది. అటు ఇంగ్లాండ్, ఇటు ఇండియా ఆటగాళ్లందరూ గ్రౌండ్ లో ప్రాక్టీసు చేస్తున్నారు.


అందరూ నామమాత్రమైన మ్యాచ్ అనుకుంటున్నారుగానీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి ఇరుజట్లకు ఇది కీలకమే కానుంది. అందువల్ల ఇరు జట్లు గెలవాలనే పట్టుదలతోనే ఆడనున్నాయి.

ఈ సందర్భంగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ జో రూట్ మాట్లాడుతూ టీమ్ ఇండియా జట్టులో అశ్విన్ తోనే మాకు ప్రమాదం పొంచి ఉందని అన్నాడు. ఎందుకంటే తను ప్రతి బాల్ ని వైవిధ్యంతోనే వేయడానికి చూస్తాడు. ముందు బాల్ డిఫెన్స్ ఆడితే, తర్వాత బాల్ కొట్టేలా వేస్తాడు. అందువల్ల బ్యాటర్ టెంప్ట్ అవుతాడు. అది బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతుల్లోకైనా వెళుతుంది. లేదంటే రాంగ్ షాట్ పడుతుందని తెలిపాడు.


Read more: ఆరోజు నన్ను తప్పించేద్దామని అనుకున్నారు: అశ్విన్

ముందు బ్యాటర్ తో మైండ్ గేమ్ ఆడుతుంటాడు, చాలా తెలివైన, ప్రమాదకరి బౌలర్ అని పేర్కొన్నాడు. అంతేకాదు అశ్విన్ అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలు వాటి పేర్లు చెప్పాడు.  సంప్రదాయ ఆఫ్ స్పిన్నర్లకు భిన్నంగా అశ్విన్ క్రీజును ఉపయోగిస్తాడని అన్నాడు. ఓవర్ స్పిన్, సైడ్ స్పిన్, స్టంప్స్‌ను టార్గెట్ చేసే బాల్స్, క్యారమ్ బాల్స్, వైడర్‌గా బౌలింగ్ చేయడం.. ఇలా అన్నిరకాలుగా అశ్విన్ బంతులు సంధిస్తుంటాడని వివరించాడు.

అందుకనే మేం ఐదోటెస్టులో అశ్విన్ ని ఎలా ఎదుర్కోవాలని, ఆ ప్రకారం వ్యూహాలు రచిస్తున్నామని తెలిపాడు.  అశ్విన్ తన కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో అందరి చూపు అశ్విన్‌పై నెలకొంది.

మరోవైపు ఇంగ్లండ్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో కూడా 100 టెస్టు మ్యాచ్ ఆడనుండటం విశేషం. అయితే బెయిర్‌స్టో ఆశించినంత గొప్పగా ఆడటం లేదు. గత నాలుగు టెస్టుల్లో వరుసగా 37, 10, 25, 26, 0, 4, 38, 30 పరుగులే చేశాడు.

Related News

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

BCCI: కోహ్లీ, రోహిత్ కు ఎదురుదెబ్బ…2027 కోసం బీసీసీఐ కొత్త ఫార్ములా…గంభీర్ కుట్రలేనా ?

Rohit Sharma Lamborghini : రోహిత్ శర్మ కారు నెంబర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే.. వాళ్లపై ప్రేమతో

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Big Stories

×