
Suhana Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గతేడాది మూడు సినిమాలతో వచ్చి మంచి విజయాలను అందుకున్నాడు.

ఇక ఇప్పుడు షారుఖ్ బాటలోనే ఆయన కూతురు సుహానా ఖాన్ కూడా మంచి స్టార్‌డమ్ ఏర్పరచుకోవాలని చూస్తోంది.

ఇందులో భాగంగా ఆమె ‘ది ఆర్చిస్’ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీపై విడుదలకు ముందే భారీ అంచానాలు ఏర్పడ్డాయి. అయితే నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు.

ఈ మూవీలో చాలామంది స్టార్ నటీనటుల పిల్లలు, మనవలు ఈ మూవీలో నటించారు.

అయితే ఈ మూవీలో సుహానా ఖన్ తన అందం, నటనతో ప్రేక్షకాభిమానుల దృష్టిని ఆకర్షించింది.

ఈ సినిమాతో సుహానా ఖాన్ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుని.. పలు సినిమా ఆఫర్లను అందుకుంది. 
అయితే ఈ ముద్దుగుమ్మ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బిజినెస్‌లలో బిజీగా మారిపోయింది.

ఇందులో భాగంగానే ముంబై శివార్లలో భారీ రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టింది. అలీబాగ్‌లో ఓ స్థలాన్ని కొనుగోలు చేసింది.

సుహానా ఖాన్ దాదాపు రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రికార్డుల ప్రకారం మొత్తం ఆస్తి విలువ 12.91 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.