BigTV English

Ravichandran Ashwin: ఆరోజు నన్ను తప్పించేద్దామని అనుకున్నారు: అశ్విన్

Ravichandran Ashwin: ఆరోజు నన్ను తప్పించేద్దామని అనుకున్నారు: అశ్విన్

 


aswin

Ravichandran Ashwin ahead of his 100th Test: వందో టెస్టు ఆడనున్న ఆనందంలో అశ్విన్ తన జ్నాపకాలను ఒకసారి గుర్తు చేసుకున్నాడు. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి భారత్-ఇంగ్లండ్ ఆఖరి టెస్టు ధర్మశాలలో జరగనుంది. ఈ ఆఖరి టెస్ట్ ఇండియాకి నామమాత్రమైనా, ఇంగ్లాండ్ కి మాత్రం ప్రెస్టేజ్ గా మారింది.


వందో టెస్టు ఆడటం తన జీవితంలో గొప్ప పండుగ లాంటిదని అశ్విన్ పేర్కొన్నాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇంత దూరం, నేనే ప్రయాణించానా? అని ఆశ్చర్యం వేస్తుందని అన్నాడు. కానీ కొన్ని మరిచిపోలేని రోజులు కూడా ఉన్నాయని తెలిపాడు.

read more: కారు అద్దం పగులకొట్టేశారు.. రాయల్ ఛాలెంజర్స్ అద్భుత విజయం

2012 ఇంగ్లండ్ టెస్టు సిరీస్, నాకొక గుణపాఠాన్ని నేర్పిందని అన్నాడు. నిజానికి ఆ సిరీస్ లో నన్ను పక్కకి పెట్టేద్దామని అనుకున్నారు. ఎందుకంటే స్పిన్నర్లు మేం చాలా పరుగులు ఇచ్చాం. అందరం కలిసి 737 పరుగులు వరకు ఇచ్చాం. అంటే నా వాటా తక్కువేగానీ, అది క్షమార్హం మాత్రం కాదని అన్నాడు.

అందరితో పాటూ, నా పనీ అయిపోయిందని అనుకున్నాను. ఆ సిరీస్ అంతా నాకు నిద్ర పట్టలేదు. దాంతో నేను సాధన పెంచాను. ఈ క్రమంలో నా టెక్నిక్ ని మరో 5శాతం పెంచుకోగలిగాను. అయితే నేనెక్కడ సేవ్ అయ్యానంటే, మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేశాను. దాంతో ఆల్ రౌండర్ గా భావించి, ఎప్పటికైనా చివర్లో ఉపయోగపడతానని చెప్పి, ఆ ఒక్క కారణంతో టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటివరకు అవకాశాలిస్తూ వచ్చిందని గుర్తు చేసుకున్నాడు.

నేనేమిటో నాకు తెలుసు, అందుకే బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేశానని అన్నాడు. అందుకనే ఇప్పటికి కూడా  ఆ నాలుగు పరుగులు చేస్తున్నానని తెలిపాడు. ఆ సిరీస్ నా కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ అని . చెప్పాడు. లేకపోతే నా బౌలింగ్ టెక్నిక్ మార్చుకోడానికి ప్రయత్నించే వాడిని కాదని చెప్పుకొచ్చాడు. అయితే 2012లో ఇంగ్లాండుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్‌ ఓడిపోయింది.

Related News

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Big Stories

×