BigTV English

Ravichandran Ashwin: ఇంగ్లాండుపై అశ్విన్ వంద వికెట్ల పండుగ.. తొలి భారత బౌలర్ గా రికార్డ్!

Ravichandran Ashwin: ఇంగ్లాండుపై అశ్విన్ వంద వికెట్ల పండుగ.. తొలి భారత బౌలర్ గా రికార్డ్!
Ravichandran Ashwin

Ashwin 100 Wickets Against England: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, అన్నట్టుగా అశ్విన్ రికార్డులన్నీ ఇంగ్లాండ్ టూర్ లోనే వచ్చేస్తున్నాయి. ఐదు టెస్టుల సుదీర్ఘ ఫార్మాట్ కావడంతో ఎన్నాళ్ల నుంచో అశ్విన్ ని ఊరిస్తున్న రికార్డులన్నీ మనవాడి పాకెట్ లోకి వచ్చి చేరుతున్నాయి.


ముఖ్యంగా ఇంగ్లాండ్ పై టెస్ట్ మ్యాచ్ ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా అశ్విన్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. అంతేకాదు ఇంగ్లాండ్ పై వేయి పరుగులు కూడా చేశాడు. ఇలా రెండువైపులా చేసిన తొలి ఆటగాడిగా కూడా మరో రికార్డ్ సృష్టించాడు.  భారత్ నుంచి ఇంతవరకు ఎవరూ ఈ ఘనతను సాధించలేదు.

స్పిన్ చాణుక్యునిగా పేరున్న రవిచంద్రన్ అశ్విన్ రాంచీ వేదికగా ఇంగ్లాండుతో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో బెయిర్ స్టోని అవుట్ చేసి 23 మ్యాచ్ ల్లో 100 వికెట్లు సాధించిన బౌలర్ గా ఘనత అందుకున్నాడు. అయితే ఇంగ్లాండ్ తరఫున చూస్తే జేమ్స్ అండర్సన్ 35 మ్యాచ్ ల్లో 139 వికెట్లు తీసుకుని అశ్విన్ కన్నా ముందున్నాడు. ఈ లెక్కన చూస్తే అశ్విన్ రెండో స్థానంలో ఉన్నట్టు లెక్క. కానీ భారత్ తరఫున చూస్తే తనే మొదటి స్థానంలో ఉన్నాడు.


Read More: రాంచీ టెస్టులో.. బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్  ఆరంగేట్రం..

ఒక్క ఇంగ్లాండ్ పైనే కాదు, ఏ ఇతర దేశంపైన అయినా సరే, భారత్ తరఫున వెయ్యి పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు.  అంతర్జాతీయంగా చూస్తే ఏడో బౌలర్ గా నిలిచాడు. తనకంటే ముందు మోనీ నోబెల్ (ఆస్ట్రేలియా), జార్జ్ గిఫెన్ (ఆస్ట్రేలియా), విల్ ఫ్రెడ్ (ఇంగ్లాండ్), గార్ ఫీల్డ్ సోబెర్స్ (వెస్టిండీస్), ఇయాన్ బోథమ్ (ఇంగ్లాండ్) , స్టువర్ట్ బ్రాడ్  (ఇంగ్లాండ్)   ఈ ఘనత సాధించారు.

స్వదేశంలో జరిగిన టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో ఆటగాడిగా అశ్విన్ ఉన్నాడు. తనకన్నా ముందు అనిల్ కుంబ్లే 63 టెస్టు మ్యాచ్ ల్లో 349 వికెట్లతో ఉన్నాడు. దీనికి అశ్విన్ మరో రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇక టెస్టుల్లో అనిల్ కుంబ్లే 35 సార్లు 5 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ కూడా 34 తో తన వెనుకే ఉన్నాడు.

అన్నీ కలిసి వస్తే ఈ రెండు టెస్టుల్లోనే రికార్డులన్నీ అశ్విన్ కొడతాడని ఆశిస్తున్నారు.

Tags

Related News

Kohli Beard : కోహ్లీకి తెల్ల గడ్డం… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న అనుష్క శర్మ !

Salman Khan IPL Team RCB : జట్టును కొనబోతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్?

Dewald Brevis : డెవాల్డ్ బ్రెవిస్ ఊచకోత.. ఏకంగా 8 సిక్స్ లతో రచ్చ..CSK ఇక తిరుగులేదు

Subhman-Anjini : టీమిండియా క్రికెటర్ తో అందాల తార ఎఫైర్… పబ్బులో అడ్డంగా దొరికిపోయారుగా

India Asia Cup Squad: ఆసియా కప్ కోసం 4 గురు ఆల్ రౌండర్లు, 6 గురు బౌలర్లు.. టీమ్ ఇండియా ఫుల్ స్క్వాడ్ ఇదే !

Dhoni – Abhishek : ఖాతాదారులకు భారీ మోసం.. ధోనికి 6 కోట్లు ఇస్తున్న SBI?

Big Stories

×