Big Stories

AP TET Hall Tickets 2024: ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

AP TET Hall Tickets Released: ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 23 నుంచి టెట్ హాల్ టికెట్లు అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 8 నుంచి టెట్ దరఖాస్తులు ప్రారంభమవ్వగా ఫిబ్రవరి 18వ తేదీలో ఇది ముగిసింది. టెట్ ఎగ్జామ్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి మార్చి 9వ తేదీ వరకూ టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ హాల్ టికెట్లను అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజ్ ఇవ్వనున్నారు.

- Advertisement -

ఫిబ్రవరి 29 వ తేదీ నుంచి మార్చి 9 వరకూ రెండు సెషన్స్ లో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 10న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. దీనిపై మార్చి 11 వరకూ అభ్యంతరాలను స్వీకరించి.. ఫైనల్ కీ మార్చి 13న రిలీజ్ చేస్తారు. చివరిగా మార్చి 14వ తేదీన ఏపీ టెట్ తుది ఫలితాలను విడుదల చేస్తారు. ఏపీ టెట్, ఏపీ డీఎస్సీ పరీక్షలను కంప్యూటర్ ఆధారంగానే నిర్వహించనున్నారు.

- Advertisement -

Read More: అరాచకాలను అడ్డుకునేందుకు కలిసి పని చేస్తాం.. పొత్తులపై షర్మిల క్లారిటీ

ఏపీ టెట్ పరీక్ష నాలుగు పేపర్లలో జరగనుంది. పేపర్ 1A – 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ పాఠాలు చెప్పే వారికి, పేపర్ 1B- 1 నుంచి 5 తరగతి వరకూ చెప్పే స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ అభ్యర్థులకు, పేపర్ 2A – 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ చెప్పే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు, పేపర్ 2B – 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ బోధించి స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ అభ్యర్థులకు నిర్వహించనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News