IND Vs SL : ఆసియా కప్ 2025 లో భాగంగా ఇవాళ సూపర్ 4 చివరి మ్యాచ్ టీమిండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. శ్రీలంక జట్టు బౌలర్లలో తీక్షణ బౌలింగ్ లో శుబ్ మన్ గిల్ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. తీక్షణ బౌలింగ్ వేసి.. తానే క్యాచ్ అందుకోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు గిల్. ఇక అభిషేక్ శర్మ మాత్రం వీలు చిక్కినప్పుడల్లా సిక్స్, ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. 31 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 2 సిక్స్ లు బాదాడు అభిషేక్.
Also Read : Abhishek- Gambhir: అభిషేక్ శర్మను బండబూతులు తిట్టిన గంభీర్..ఈ దెబ్బకు ఉరేసుకోవాల్సిందే !
దీంతో అభిషేక్ శర్మ ఇవాళ శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో రికార్డులను బద్దలు కొట్టాడు. టీ-20 ఆసియా కప్ లో ఒక ఏడాది ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రిజ్వాన్ 281 పేరిట ఉన్న రికార్డు ను బ్రేక్ చేశాడు అభిషేక్ శర్మ. టీమిండియా తరపున ఒకే టోర్నీలో 300+ రన్స్ చేసిన తొలి ఆటగాడిగా 309 నాటౌట్ గా నిలిచాడు. అలాగే తక్కువ బంతుల్లో 50 చేసిన ప్లేయర్లలో రోహిత్ 6 సార్లు, రికార్డును సమం చేశాడు. వరుసగా ఎక్కువ సార్లు 30 + స్కోర్ చేసిన రిజ్వాన్, రోహిత్ శర్మ (7) సరసన చేరాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. తిలక్ వర్మ, సంజూ శాంసన్ కీలకంగా ఆడారు. కానీ సంజూ శాంసన్ కేవలం 39 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. తిలక్ వర్మ మాత్రం హాఫ్ సెంచరీ కి చేరువయ్యాడు. కానీ హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. 49 పరుగులు నాటౌట్ గా నిలిచాడు. సంజూ శాంసన్ ఔట్ కాగానే.. క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఎక్కువసేపు క్రీజులో కుదురుకోలేకపోయాడు. 3 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి చమీరా బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు హార్దిక్ పాండ్యా. ఆ తరువాత వచ్చిన అక్షర్ పటేల్ చివరి వరకు క్రీజులో ఉన్నాడు.
ఇక శ్రీలంక బౌలర్లలో తీక్షణ 1, చమీర 1, హసరంగ 1, శనక 1, అసలంక 1 చొప్పున వికెట్లు తీసుకున్నారు. దీంతో భారత్ 202 పరుగులు చేసింది. శ్రీలంక టార్గెట్ 203 పరుగులు. వాస్తవానికి తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేస్తాడని అంతా భావించారు. కానీ చివరి రెండు బంతులు కూడా అక్షర్ పటేల్ ఆడటంతో తిలక్ వర్మ కి ఛాన్స్ రాలేదు. దీంతో 49 పరుగులతో మాత్రమే సరిపెట్టుకున్నాడు. కానీ ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్, తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 202 పరుగులు చేయగలిగింది.