Hardik Pandya : సాధారణంగా టీమిండియా(Team India) ఆటగాళ్లు ఈ మధ్య కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆసియా కప్ ఎల్లుండే ప్రారంభం కానుండటంతో ఆసియా కప్ 2025 క్రికెట్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. మరోవైపు బీసీసీఐ (BCCI) సమావేశం, బీసీసీఐ ఎన్నికలు ఇలా టీమిండియా, బీసీసీఐ గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వాచ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసియా కప్ సెప్టెంబర్ 09 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే అంతకంటే రెండు రోజుల ముందే హార్దిక్ పాండ్యా ధరించిన వాచ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారడం విశేషం.
Also Read : Virender Sehwag : ఖాళీ కడుపుతోనే పాక్‌పై సెంచరీ చేశా.. సెహ్వాగ్ సెన్షేషన్ కామెంట్స్
ముఖ్యంగా హార్దిక్ పాండ్యా వాచ్ చర్చల్లోకి రావడానికి ఓ కారణం ఉందండోయ్.. అది ఏంటంటే..? పాండ్యా ధరించిన వాచ్ ఆసియా కప్ కోసం ఎంపికైన పాకిస్తాన్ లోని 17 మంది ఆటగాళ్ల సంవత్సరం జీతం కలిపిన కూడా హార్దిక్ పాండ్యా వాచ్ ధర కంటే తక్కువే అంట. దుబాయ్ లో ప్రాక్టీస్ చేయడానికి వచ్చినప్పుడు హార్దిక్ పాండ్యా ధరించిన ఖరీదైన ఈ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం టీమిండియా దుబాయ్ లో ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పాకిస్తాన్ కి చెందిన ఆటగాళ్ల వార్షిక జీతం ఎంత అనేది తెలుసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. ప్రధానంగా ఆసియా కప్ కోసం పాకిస్తాన్ సెలెక్ట్ చేసిన 17 మంది ఆటగాళ్లలో ఏడుగురు ఆటగాళ్లు గ్రేడ్ బీ లో ఉన్నారు. ఈ జాబితాలో అబ్రార్ అహ్మద్, ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, సామ్ అయూబ్, సల్మాన్ అఘా,షాహిన్ అప్రిది ఉన్నారు. వీరందరికీ వార్షిక జీతం ఒక్కొక్కరికీ రూ.1,69, 02, 540. ఇలా ఏడుగురు ఆటగాళ్ల వార్షి జీతం 11,83,17,780 అవుతుంది.
పాక్ నుంచి 5 మంది ఆటగాళ్లు గ్రేడ్ సీలో ఉన్నారు. వీరు ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, షాహిబ్దాదా ఫర్హాన్. వీరిలో ఒక్కొక్కరి వార్షిక జీతం ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.93,90,300. అంటే వీరి ఐదుగురి జీతం రూ.4,69,51, 500 అన్నమాట. ఇక మిగిలిన 5 మంది ఆటగాళ్లు గ్రేడ్ డీలో ఉన్నారు. వీరికి వార్షికంగా రూ.56,34,180 భారత కరెన్సీలో జీతం లభిస్తుంది. ఈ ఐదుగురి మొత్తం వార్షిక జీతం రూ.2,81,70,900. ఆసియా కప్ కి ఎంపికైన మొత్తం 17 మంది పాకిస్తాన్ ఆటగాళ్ల వార్షిక జీతాలను కలిపినా.. ఆ మొత్తం భారత కరెన్సీలో రూ.19.34 కోట్లు. ఈ మొత్తం హార్దిక్ పాండ్యా వాచ్ ధర కంటే తక్కువనే. మరోవైపు హార్దిక్ పాండ్యా వాచ్ నెట్ వర్త్ ప్రైజ్ 63 కోట్లు.. బాబర్ అజామ్ టోటల్ నెట్ వర్త్ ప్రైజ్ 49 కోట్లు అంటే.. బాబర్ అజామ్ ఆస్తులు అమ్ముకున్నా కానీ సరిపోవని సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం.