BigTV English

Australia Team : ఆస్ట్రేలియా ఓటమికి కారణాలెన్నో…

Australia Team :  ఆస్ట్రేలియా ఓటమికి కారణాలెన్నో…
Australia vs South Africa match

Australia vs South Africa match(World cup latest update):

లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనుకుంటే ఆస్ట్రేలియన్లు చప్పగా ముగించారు. మొదట ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇదే మొదటి తప్పిదంగా క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. పిచ్ స్వభావాన్ని తప్పుగా అంచనా వేయడమే ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. సౌత్ ఆఫ్రికా అంత ఫ్రీగా ఆడిన పిచ్ పై ఆసీస్ బ్యాటర్లు తడబాటుకి గురికావడం క్రీడా పండితులని విస్మయానికి గురి చేసింది.


నిజానికి ముందురోజు వాతావరణ రిపోర్ట్ ఏం ఇచ్చారయ్యా అంటే… వర్షం పడే అవకాశం తక్కువగా ఉంది. లక్నోలో వాతావరణం తేమగా ఉంటుంది. అయితే ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పిచ్ బ్యాటింగ్ కు స్వల్పంగా అనుకూలంగా కనిపిస్తోందని అంతర్గతంగా ఇరు జట్లకి అందిన సమాచారంగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఒకవేళ టాస్ గెలిస్తే ఏది ఎంచుకోవాలో జట్టు మేనేజ్మెంట్, కోచ్, కెప్టెన్ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. అదే విషయాన్ని బయట కెప్టెన్ ప్రకటిస్తాడు. ఇది అభిమానులు గ్రహించాలని సీనియర్ క్రికెటర్లు అంటున్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం ఎంత పెద్ద పొరపాటు నిర్ణయమో బ్యాటింగ్ చేసినప్పుడు ఆస్ట్రేలియాకి అర్థమైంది. బహుశా సెకండ్ బ్యాటింగ్ సమయానికి పిచ్ లో టర్న్ ఎక్కువవడాన్ని ముందుగా కెప్టెన్ గ్రహించినట్టు లేదు. ప్రపంచంలో మేటి బ్యాటర్స్ గా పేరున్నవారు గల్లీ ఆటగాళ్లుగా పెవెలియన్ బాట పట్టారు. నిజానికి ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ పీడకల అని చెప్పాలి.

ఆస్ట్రేలియాలో ముగ్గురు పేస్ బౌలర్లలో హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్ ఒక మ్యాచ్ లో ఒకరు బాగా ఆడితే, ఒక మ్యాచ్ లో ఒకరు ఆడుతున్నారు. మ్యాక్స్ వెల్ కి ఆల్ రౌండర్ కష్టాలున్నాయి. లెగ్ స్పిన్నర్ జంపా ఆకట్టుకోలేకపోతున్నాడు. వీరికి తగ్గట్టుగానే బ్యాటర్లు కష్టాలు పడుతున్నారు. అప్పటికి ఇండియా లో ఆడిన ఇద్దరిని పక్కన పెట్టారు. అలెక్స్ కారీ స్థానంలో జోష్ ఇంగ్లిస్, కెమెరూన్ గ్రీన్ స్థానంలో మార్కస్ స్టోయినిస్‌ జట్టులోకి వచ్చారు. దక్షిణాఫ్రికా జట్టులో ఒక మార్పు జరిగింది. గెరాల్డ్ కూటీస్ స్థానంలో తబ్రేజ్ షమ్సీ తిరిగి వచ్చాడు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×