BigTV English

AUS vs WI 3rd T20 : రసెల్ వీర ఉతుకుడు.. మూడో టీ 20లో విండీస్ ఘన విజయం..!

AUS vs WI 3rd T20 : రసెల్ వీర ఉతుకుడు.. మూడో టీ 20లో విండీస్ ఘన విజయం..!
Australia vs West Indies Highlights

Australia vs West Indies Highlights(Latest sports news telugu): ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య మూడు టీ 20 సిరీస్ లో భాగంగా జరిగిన ఆఖరి టీ 20లో వెస్టిండీస్ విజయం సాధించింది. వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులే చేయగలిగింది. డేవిడ్ వార్నర్, మ్యాక్స్ వెల్ ధాటికి రెండు టీ 20 లు గెలిచిన ఆస్ట్రేలియా మూడో మ్యాచ్ లో మాత్రం చతికిలపడింది.


టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ ఒక దశలో 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రోస్టన్ ఛేజ్ (37; 20 బంతుల్లో), కెప్టెన్ పావెల్ (21; 14 బంతుల్లో) దూకుడుగా ఆడుతూ రన్‌రేట్‌ను పెంచారు. కానీ ఎక్కవుసేపు క్రీజులో నిలవలేకపోయారు.

అప్పుడొచ్చాడు క్రీజులోకి ఆండ్రూ రస్సెల్. అయితే అనూహ్యంగా రెండో బంతి వేగంగా చేతికి తగలడంతో క్రీజులోనే చెట్టులా కూలిపోయాడు. అయిపోయిందిరా.. వెస్టిండీస్ కథ అని అంతా అనుకున్నారు. కానీ రస్సెల్ కొత్త శక్తితో లేచాడు.


ఏమైతే అయ్యిందని, ఈ బాల్, ఆ బాల్ అని లేదు, అడ్డొచ్చిన ప్రతీ బాల్ ని చితక్కొట్టి పారేశాడు. అలా 21 బంతుల్లో 71 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లను ఠారెత్తించాడు. అందులో 7 సిక్స్ లు, 4 ఫోర్లు ఉన్నాయి. రస్సెల్ విధ్వంసానికి రూథర్ ఫర్డ్ తోడయ్యాడు. తను 40 బంతుల్లో 67 పరుగులు ధనాధన్ చేసి పారేశాడు.  ఆరో వికెట్‌కు 119 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

వీరిద్దరూ కలిసి ముఖ్యంగా ఆసిస్ స్పిన్నర్ జంపాని ఒక ఆట ఆడుకున్నారు. వీరి దెబ్బకి జంపా 4 ఓవర్లలో 65 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తానికి వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 220 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జేవియర్ 2, బెహ్రెన్‌డాఫ్, జాన్సన్, జంపా, హర్డీ ఒకొక్క వికెట్ తీసుకున్నారు.

అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా అదిరిపోయే ఆరంభంతో ప్రారంభించింది. డేవిడ్ వార్నర్ విధ్వంసం ఇక్కడ కూడా కొనసాగింది.  మిచెల్ మార్ష్ (17)తో కలిసి తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. తర్వాత ఆరోన్ తో (16) కలిసి వార్నర్ స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. చివరికి 49 బంతుల్లో 81 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు.

అనంతరం క్రీజులో వచ్చిన జోస్ ఇంగ్లిస్ (1), గ్లెన్ మాక్స్‌వెల్ (12) కూడా విఫలమయ్యారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ కూడా వెస్టిండీస్ బ్యాటర్ రస్సెల్ ను తలపించాడు. తను కూడా 19 బంతుల్లో 41 పరుగులు చేసి, మ్యాచ్ ని గెలిపించేంత పని చేశాడు. కానీ తన శక్తి సరిపోలేదు. అప్పటికే సమయం మించిపోయింది. ఓవర్లు అయిపోయాయి.

ఆస్ట్రేలియాలో ప్రతీ బ్యాటర్ కూడా మ్యాచ్ విన్నర్ అనే సంగతిని టిమ్ డేవిడ్ నిరూపించాడు. అయితే వార్నర్ విధ్వంసం జరుగుతున్నంత సేపు ఆస్ట్రేలియాదే విజయమని అనుకున్నారు. కానీ వెస్టిండీస్ బౌలర్లు కీలక సమయాల్లో ముఖ్యమైన వికెట్లు తీసి ఆస్ట్రేలియా కొంప ముంచారు. చివరకు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి పరాజయం పాలైంది.

 విండీస్ బౌలర్లలో షెఫార్డ్ 2, రోస్టన్ ఛేజ్ 2, హోస్సేన్ ఒక వికెట్ పడగొట్టారు.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×