BigTV English

TS Assembly Sessions : కోరం మెంబర్స్ పై కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య వాదన.. పెళ్ళిళ్లున్నాయ్ త్వరగా కానివ్వండి..

TS Assembly Sessions : కోరం మెంబర్స్ పై కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య వాదన.. పెళ్ళిళ్లున్నాయ్ త్వరగా కానివ్వండి..
Political news in telangana

TS Assembly Budget Sessions(Political news in telangana): ఆరవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమయ్యీ అవ్వగానే.. కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య వాదన జరిగింది. అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు అంటే.. షార్ప్ గా 10 గంటలకు హాజరు కావాలని.. 10.05 గంటలకు, 10.10 గంటలకు కాదని అన్నారు. అలాగే సభ్యులంతా అసెంబ్లీకి వచ్చే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుదేనని పేర్కొన్నారు.


స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు.. అసెంబ్లీ సమావేశాలకు 12 మంది కోరం ఉంటే చాలని.. తాము 18 మంది ఉన్నామని బడ్జెట్ పై చర్చ ప్రారంభించవచ్చని తెలిపారు. కోరం లేదన్న కారణం చూపించి సభను వాయిదా వేయాలనడం సరికాదన్నారు. బీఆర్ఎస్ సభ్యులే సభ వద్దని బయటకు వెళ్లారని మంత్రి శ్రీధర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 10 శాతం ఉండాలని చెబుతున్న మంత్రికి 18 మంది ఎక్కడ కనిపిస్తున్నారని ప్రశ్నించారు. వాళ్లు 14 మందే ఉన్నారని తెలిపారు. అసెంబ్లీని అబాసుపాలు చేయాలన్న ఉద్దేశం తమకు లేదని, తాము పూర్తిగా సహకరిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమయంలో తాము పనికిరాని రాజకీయాలు చేయాలని అనుకోవట్లేదని పేర్కొన్నారు.

Read More : అసెంబ్లీలో కేసీఆర్‌ హాజరుపై ఉత్కంఠ.. ఐ డోంట్ కేర్ అంటున్న గులాబీ బాస్..


ఇంతలో మైక్ అందుకున్న దానం నాగేందర్.. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ పై చర్చను త్వరగా ముగించాలని, మాకు పెళ్లిళ్లు, కార్యక్రమాలు ఉన్నాయని స్పీకర్ కు తెలిపారు. దానం నాగేందర్ చెప్పిన ఈ కారణం.. నవ్వులు తెప్పించింది. కాగా.. బడ్జెట్ పై చర్చ పూర్తయ్యాక.. కొత్త సభ్యులకు తమ నియోజకవర్గాల్లో సమస్యలను చెప్పుకునేందుకు జీరో అవర్ ఇస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. నిర్థిష్ట సమయంలోగా చర్చ పూర్తయితే.. జీరో అవర్ కేటాయిస్తామన్నారు.

Tags

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×