 
					Pro Kabaddi Final : ప్రో కబడ్డీ 2025 టోర్నమెంట్ ( Pro Kabaddi 2025) ఛాంపియన్ గా దబాంగ్ ఢిల్లీ కేసీ ( Dabang Delhi K.C.) నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో పుణేరి పల్టాన్ జట్టుపై దబాంగ్ ఢిల్లీ అదిరిపోయే విక్టరీ అందుకుని చాంపియన్ గా నిలిచింది. ఫైనల్ లో 31-28 పాయింట్ల తేడాతో పుణేరి పల్టాన్ ( Puneri Paltan) జట్టును చిత్తు చేసింది దబాంగ్ ఢిల్లీ. ఇక అటు ఫైనల్స్ ఓడిన పుణేరి పల్టాన్ జట్టు రన్నరప్ గా నిలిచింది. దీంతో ప్రో కబడ్డీ టోర్నమెంట్ లో రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది దబాంగ్ ఢిల్లీ. దీంతో సంబరాలు అంబరాన్ని ఉంటాయి.
ప్రో కబడ్డీ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ దబాంగ్ ఢిల్లీ కేసి వర్సెస్ పుణేరి పల్టన్ జట్ల మధ్య జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలోని త్యాగరాజు ఇండోర్ స్టేడియంలో ( Thyagaraju Indoor Stadium) ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో 31-28 తేడాతో పుణేరి పల్టాన్ జట్టును దారుణంగా ఓడించింది దబాంగ్ ఢిల్లీ కేసి. దీంతో రెండోసారి ప్రో కబడ్డీ లీగ్ టోర్నమెంట్ లో ఛాంపియన్ గా నిలిచింది. 2021- 22 సీజన్ లో దబాంగ్ ఢిల్లీ కేసీ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక 2023-2024 లో పుణేరి పల్టాన్ ( Puneri Paltan ) టైటిల్ ఎగురేసుకు వెళ్ళింది. అంటే ప్రో కబడ్డీ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు రెండు సార్లు ఛాంపియన్ గా నిలిచింది దబాంగ్ ఢిల్లీ కేసీ. ఛాంపియన్ గా దబాంగ్ ఢిల్లీ కేసీ నిలవడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రో కబడ్డీ 2025 టోర్నమెంట్ ( Pro Kabaddi 2025) ఛాంపియన్ గా దబాంగ్ ఢిల్లీ కేసీ ( Dabang Delhi K.C.) నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ప్రో కబడ్డీ 2025 టోర్నమెంట్ లో ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు ఫ్రైజ్ మనీ ఎంత ఇస్తారనే దానిపైన సరికొత్త చర్చ మొదలైంది. ముందుగా ఫిక్సయిన లెక్క ప్రకారం ఛాంపియన్ దబాంగ్ ఢిల్లీ కేసీ ( Dabang Delhi K.C.) జట్టుకు మూడు కోట్ల ప్రైస్ మనీ అందించబోతున్నారు. ఇక రన్నరప్ గా నిలిచిన పుణేరి పల్టాన్ జట్టుకు 1.8 కోట్లు వస్తాయి. సెమీ ఫైనల్ లో ఓడిపోయిన బెంగాల్ వారియర్స్ తో పాటు పాట్నా పైరేట్స్ జట్లకు రూ. 90 లక్షల చొప్పున అందించబోతున్నారు. ఇక 2025 ప్రో కబడ్డీ టోర్నమెంటులో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా పుణేరి పల్టాన్ జట్టుకు చెందిన అస్లాం నిలిచాడు. రైడర్ ఆఫ్ ద సీజన్ గా బెంగాల్ వారియర్స్ కు ( bengal ) చెందిన దేవంక్ నిలవడం జరిగింది.
Also Read: SHREYAS IYER: గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్.. కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే
PKL 2025 Champions 🏆@DabangDelhiKC have been crowned the champions of @ProKabaddi Season 12 with a sensational win over @PuneriPaltan 31-28 #PKL2025 #GhusKarMaarenge #DabangDelhi #PuneriPaltan pic.twitter.com/UPMjfPOO4n
— myKhel.com (@mykhelcom) October 31, 2025