Heinrich Klaasen: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 tournament ) ముగుస్తోంది. ఆదివారం రోజున టీమిండియా వర్సెస్… న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ పూర్తి కాగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ హడావిడి కొనసాగుతుంది అయితే ఇలాంటి నేపథ్యంలో… సన్రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) ఫ్యాన్స్ తో పాటు.. ఆ జట్టు ఓనర్ కావ్య పాప టెన్షన్ పడుతున్నారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు, సన్రైజర్స్ హైదరాబాద్ డేంజర్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen) ఆటతీరు.
హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen) సిక్సులు అలాగే ఫోర్లు బాగానే కొడతాడు…. కానీ అతడు ఆడితేనే పెద్ద సమస్యగా మారింది. హెన్రిచ్ క్లాసెన్ ఏ టీం లో ఆడినా.. ఆ జట్టు… కీలక మ్యాచ్లో ఓడిపోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్ మ్యాచ్ ఓడినట్లే… మిగతా లీగుల్లో కూడా హెన్రిచ్ క్లాసెన్ ఆడిన జట్లు ఫైనల్ మ్యాచ్ లలో ఓడిపోయాయి. ఇలా ఇప్పటి వరకు చాలా సంఘటనలు జరిగాయి. 2023 నుంచి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఇదే తంతు. 2023 MLC లీగ్ ఫైనల్… మ్యాచ్ లో హెన్రిచ్ క్లాసెన్ ఆడిన మ్యాచ్ ఓడిపోయింది. అలాగే 2024 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా టి20 ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టీమిండియా చేతిలో సౌత్ ఆఫ్రికా చిత్తుచిత్తుగా ఓడిపోయింది. గెలవాల్సిన మ్యాచ్లో చివరకు.. సూర్య కుమార్కు యాదవ్ కు క్యాచ్ ఇచ్చి… దక్షిణాఫ్రికా దారుణంగా ఓడిపోయింది.
ఇక ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ఫైనల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… ఫైనల్ వరకు దుమ్ము లేపింది. ఇదే జట్టులో ఉన్న హెన్రిచ్ క్లాసెన్ అద్భుతంగా రాణించాడు. జట్టును ముందుండి ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. మనోడికి కాలి మహిమను తెలియదు కానీ.. ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ దారుణంగా ఓడిపోయింది. ఇక 2023 వన్డే వరల్డ్ కప్ లో… సెమీస్ దాకా వెళ్లిన సౌత్ ఆఫ్రికా ఓడిపోవడం జరిగింది. అలాగే.. మొన్న జరిగిన 2024 సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో ఫైనల్లో కూడా కావ్య పాప టీం ఓడిపోయిన సంగతి తెలిసిందే.
తాజాగా… 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ లో కూడా న్యూజిలాండ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా. హెన్రిచ్ క్లాసెన్ కాస్త టచ్ లోకి వస్తే సౌత్ ఆఫ్రికా విజయం సాధించేది. కానీ దురదృష్టం… సౌత్ ఆఫ్రికాను వెంటాడింది. ఇలా క్లాసెన్ ఆడిన ఏ జట్టైనా ఫైనల్ వరకు వెళ్లడం… ఓడిపోవడం జరుగుతోంది. అయితే ఇలా వరుసగా క్లాసెన్ ఆడిన జట్టు ఓడిపోవటాన్ని… జీర్ణించుకోలేకపోతోంది హైదరాబాద్ ఓనర్ కావ్య పాప. ఈసారి ఎలాగైనా ఐపిఎల్ 2025 టోర్నమెంట్ గెలవాలని కావ్య పాప స్కెచ్ లు వేస్తోంది. ఈసారి కూడా హైదరాబాద్ జట్టు తరఫున క్లాసెన్ ఆడుతున్నాడు. దీంతో మళ్లీ ఓడిపోతామా ? అనే టెన్షన్లో కావ్య పాప ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.