BigTV English

International Womens Day: ఉమెన్స్ డే సందర్బంగా నక్లెస్ రోడ్డులో రన్ ఫర్ యాక్షన్.. ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క

International Womens Day: ఉమెన్స్ డే సందర్బంగా నక్లెస్ రోడ్డులో రన్ ఫర్ యాక్షన్.. ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క

Run for Action 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్డులో రన్ ఫర్ యాక్షన్ 2025 కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. విమెన్ సేఫ్టి నేపథ్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా కార్యక్రమం జరుగుతోంది. మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. మహిళలు, విద్యార్ధినులు ,వాకర్స్, రన్నర్స్ 2కె, 5కె రన్‌లో పాల్గొంటున్నారు.


ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడూతూ.. మహిళలు ఫిజికల్ ఫిట్‌నెస్‌తోపాటు మెంటల్‌గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలన్నారు. మహిళల మీద యుగాల నుంచి ఉన్న అణిచివేతను, సమాజంలోని చిన్నచూపుని తీసివేస్తూ.. మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.  మహిళలంటే సమాజంలో ఇంకా చిన్నచూపు చూస్తున్నారు. మహిళలు అంటే సెకండ్ గ్రేడ్ వర్కర్స్‌లా చూస్తున్నారని అన్నారు. పురుషులు, మహిళలు అందరికీ సమానత్వం ఉండాలని ఆమె పేర్కొన్నారు. మహిళలు అంటే ప్రతి ఒక్కరిలో గౌరవం ఉండాలి.

ఆపదలో ఉన్న మహిళలు, అమ్మాయిలను ఆదుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మహిళ వ్యక్తిత్వం వికాసం కోరుకోవాలని తెలిపారు. సమాజంలో మహిళలను కాపాడుదాం.. ఎదుగనిద్దాం అని మంత్రి సీతక్క తెలిపారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు చేయూత అందిస్తున్నారని, పోలీసు శాఖ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం నుంచి అమలయ్యే అన్ని హామీలను అందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి ఎంతో మంది మహిళలు వస్తుంటారని.. అలాంటి వారందరికి పోలీసులు భరోసా ఇస్తున్నామన్నారు.


అంతర్జాతీయ మహిళ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మహిళ పోలీస్ సిబ్బంది, సచివాలయం మహిళా పోలీసులు, వివిధ కాలేజీల స్టూడెంట్స్ పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరా మున్సిపల్ స్టేడియం నుంచి ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ లక్ష్మీష, సీపీ రాజశేఖర్ బాబు, డీసీపీ గౌతమిశాలి ఇతర పోలీస్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Also Read: ప్రజాభవన్‌లో అన్ని పార్టీల ఎంపీల సమావేశం.. కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధన ఎజెండా

మహిళలు అన్ని రంగాల్లో సాధించిన విజయాలను పురస్కరించుకొని ప్రతి ఏటా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు.. ఆర్థిక రాజకీయ సామాజిక ఉపాధి రంగాల్లో మహిళలు రంగంలో రాణిస్తూ ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగాలు చేస్తూ ప్రజలకు సేవ అందిస్తున్నారు. కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ మొదలుకొని వివిధ శాఖలో మహిళలు ఉన్నంత పదవుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు .. ప్రజలకు మంచి సేవలను అందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.

Related News

CM Revanth Reddy: మా కమిట్మెంట్ నిరూపించుకున్నాం.. పది రోజులు చాలన్న సీఎం రేవంత్

Bc Bill: సడన్‌గా రాజకీయ పార్టీలకు బీసీలపై ప్రేమ దేనికి?

Birth Certificate: ఇదెక్కడి ఘోరం.. బర్త్ సర్టిఫికెట్‌కు అప్లై చేస్తే డెత్ సర్టిఫికెట్..?

Ponnam Prabhakar: హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఏ ప్యాకేజ్ తీసుకొచ్చారు

Srushti Fertility IVF Scam: రూ.20 కోట్లు.. 80 మంది పిల్లలు.. నమ్రత కేసులో సంచలనాలు

Rain Alert: మరి కాసేపట్లో భారీ వర్షం.. త్వరగా ఆఫీసులకు చేరుకోండి, లేకపోతే…

Big Stories

×