BigTV English

BAN vs NZ : గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసం.. న్యూజిలాండ్‌కు స్వల్ప ఆధిక్యం..

BAN vs NZ :  గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసం.. న్యూజిలాండ్‌కు స్వల్ప ఆధిక్యం..
BAN vs NZ 2nd Test

BAN vs NZ : చావో రేవో తేల్చుకోవాల్సిన దశలో కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ బంగ్లాదేశ్ బౌలర్లను చాకిరేవ్ పెట్టి వదిలేశాడు. మామూలుగా కొట్టలేదు. అదే పిచ్ పై సింగిల్స్ తీయడానికే ఇబ్బంది పడ్డ టాప్ ఆర్డర్ కు దిమ్మతిరిగేలా ఎడా పెడా ఫోర్లు, సిక్స్ లతో చెలరేగిపోయాడు.


బంగ్లాదేశ్ బౌలర్లు నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. జరిగేది టెస్ట్ మ్యాచేనా? లేక టీ 20 మ్యాచ్ నా? అన్నట్టు చేష్టలుడిగి ఉండిపోయారు. మొత్తానికి 72 బాల్స్ లో 87 పరుగులు చేసి సెంచరీ ముందు అవుట్ అయిపోయాడు.

వివరాల్లోకి వెళితే న్యూజిలాండ్ – బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసందే. మొదటి టెస్ట్ లో 150 పరుగుల తేడాతో ఓటమి పాలైన కివీస్, రెండో టెస్ట్ లో నైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని అనుకుంది.
కానీ అంతకన్నా దారుణంగా రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో తొలిరోజు 55 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో చచ్చీ చెడి 172 పరుగులు చేసింది.


కివీస్ దుస్థితి చూస్తే, రెండు ఇన్నింగ్స్ లో కలిపి 170కే ఆలౌట్ అయ్యేలా కనిపించారు. అయితే రెండోరోజు వరుణ దేవుడు కరుణతో హమ్మయ్యా అనుకున్నారు. మొత్తం ఆట రద్దయ్యింది. మూడో రోజు తొలి సెషన్ లో కూడా కివీస్ బ్యాట్స్ మెన్ ఎక్కడా రాజీ పడలేదు. 97 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి మరిన్ని కష్టాల్లో పడ్డారు.

ఈ సమయంలో క్రీజులోనే ఉన్న గ్లెన్ ఫిలిప్స్ తన ముందే వికెట్లు పడుతుంటే  ఏమనుకున్నాడో ఏటో తెలీదు. ఒక్కసారి పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. అంత కఠినమైన పిచ్ మీద కూడా అతి సులువుగా టీ 20 ఆడినట్టు ఆడి, కివీస్ ను ఒంటిచేత్తో ఒడ్డుకి లాగేశాడు. చివరికి 87 పరుగులు చేసి 180 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. తను ఇలా అవగానే ఆఖరి వికెట్ పడిపోయింది. 180 పరుగులే చివరికి కివీస్ కి దిక్కయ్యాయి.

తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మూడో రోజు ఆట ముగిసేసరికి 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. హసన్ జాయ్ (2), నజ్ముల్ (15) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. మూడో రోజు ఆట కేవలం 32 ఓవర్లు మాత్రమే జరిగింది. వెట్ అవుట్ ఫీల్డ్ కారణంగా ఫస్ట్ సెషన్ రద్దు కాగా, బ్యాడ్ లైట్ కారణంగా మూడో సెషన్ పూర్తిగా కొనసాగలేదు.

ఈ పరిస్థితుల్లో అతికష్టమ్మీద 8 పరుగుల ఆధిక్యంలోకి వచ్చిన కివీస్ ఏమైనా బంగ్లాదేశ్ ను సెకండ్ ఇన్నింగ్స్ లో 150 పరుగులకి ఆలౌట్ చేసి, తర్వాత వీరు జాగ్రత్తగా ఆడి గెలిస్తే, సిరీస్ కాపాడుకున్నట్టవుతుంది. పోయిన పరువు మళ్లీ దక్కుతుంది. గౌరవంగా దేశానికి వెళ్లినట్టవుతుంది.

Related News

Women’s ODI World Cup : మహిళల ప్రపంచ కప్ లో కూడా ఆస్ట్రేలియా డామినేట్.. ఈ లెక్కలు చూస్తే వణుకు పుట్టాల్సిందే

Kashish Kapoor : ఒక నైట్ కు వస్తావా? అని అడిగాడు… టీమిండియా క్రికెటర్ పై హాట్ బ్యూటీ సంచలన ఆరోపణలు!

Women’s World Cup 2025 : చిన్నస్వామిలో మ్యాచ్ లు బ్యాన్.. తిరువనంతపురంకు షిఫ్ట్.. షాక్ లో RCB!

Kohli Beard : కోహ్లీకి తెల్ల గడ్డం… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న అనుష్క శర్మ !

Salman Khan IPL Team RCB : జట్టును కొనబోతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్?

Dewald Brevis : డెవాల్డ్ బ్రెవిస్ ఊచకోత.. ఏకంగా 8 సిక్స్ లతో రచ్చ..CSK ఇక తిరుగులేదు

Big Stories

×