BigTV English

BAN vs NZ, 1st Test : సంచలనం .. టెస్ట్ మ్యాచ్ లో కివీస్ పై గెలిచిన బంగ్లాదేశ్

BAN vs NZ, 1st Test : సంచలనం .. టెస్ట్ మ్యాచ్ లో కివీస్ పై గెలిచిన బంగ్లాదేశ్
BAN vs NZ

BAN vs NZ, 1st Test : వన్డే వరల్డ్ కప్ 2023లో పేలవమైప ప్రదర్శనతో నిష్క్రమించిన బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ లో విజృంభించి ఆడి కివీస్ పై విజయం సాధించింది. సొంతగడ్డపై న్యూజిలాండ్ తో జరుగుతున్నరెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ లో 150 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది. 332 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 181 పరుగులకే ఆలౌట్ అయి, ఓటమి పాలయ్యింది.


ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. హసన్ జాయ్ (86) ఒక్కడే రాణించాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. కేవలం 7 పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్(205 బంతుల్లో 11 ఫోర్లతో 104) సెంచరీ సాధించాడు. డారిల్ మిచెల్(41), గ్లేన్ ఫిలిప్స్(42) కీలక ఇన్నింగ్స్ ఆడి కెప్టెన్ కు సహకరించారు.

రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ నెమ్మదిగా పుంజుకుంది. మళ్లీ 338 పరుగులు చేసింది. హోస్సెన్ షాంటో(105) సెంచరీ చేశాడు. ముఫికర్ రహీమ్ (67), హసన్ మీరాజ్ (50 నాటౌట్)  అతనికి సహకరించారు. దీంతో న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్  332 పరుగుల భారీ లక్ష్యం చేధించాల్సి వచ్చింది.


అప్పటికే పిచ్ మీద పూర్తిగా పగుళ్లు వచ్చేశాయి. కంప్లీట్ స్పిన్ కి అనుకూలంగా మారిపోయింది. దీంతో బంగ్లాదేశ్ సాదారణ స్పిన్నర్లు సైతం విజృంభించారు. తైజుల్ ఇస్లామ్(6/75) ఆరు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు. నయీమ్ హసన్(2/40) రెండు వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్, హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు.

అంతర్జాతీయ ఆటగాళ్లయిన కివీస్ బ్యాటర్లు ఈ పిచ్ మీద తేలిపోయారు. కనీసం డ్రా అయినా చేద్దామని విశ్వ ప్రయత్నం చేశారు. వారి వల్ల కాలేదు. ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టారు.  డారిల్ మిచెల్(58) మినహా అందరూ విఫలమయ్యారు. చివర్లో టీమ్ సౌథీ(34) ఒంటరి పోరాటం చేశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర ఉపయోగం వారికి ఇప్పుడర్థమైంది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో తనని సెలక్ట్ చేయలేదు. మొత్తానికి బంగ్లాదేశ్ చేతిలో కివీస్ రెండోసారి ఓడి పరాభవాన్ని మూటగట్టుకుంది.

Related News

5 Balls Won Match: 5 బంతుల్లో ముగిసిన మ్యాచ్…7 గురు డకౌట్… 23 పరుగులకే ఆలౌట్

Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Big Stories

×