BigTV English

Ganesh festival: సీఎం రేవంత్ రివ్యూ, గణేష్ ఫెస్టివల్.. కీలక సూచనలు..

Ganesh festival: సీఎం రేవంత్ రివ్యూ, గణేష్ ఫెస్టివల్.. కీలక సూచనలు..

Ganesh festival: వినాయక చవితి పండగకు కేవలం వారం రోజులు మాత్రమే ఉండడంతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు చేశారు. నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వాహించాలన్నా కచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందేనని వెల్లడించారు.


హైదరాబాద్ అంటే వినాయక చవితి.. గణేష్ ఫెస్టివల్ భాగ్యనగరం.. ఇక్కడి సందడి అంతా ఇంకా కాదు. భాగ్యనగరంలో గణేష్ పెస్టివల్ కోసం వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. వినాయక చవితికి కేవలం వారం రోజులు మాత్రమే మిగిలింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అటు వైపు దృష్టి సారించింది. గణేష్ ఉత్సవాల మండ‌పాల ఏర్పాటు, తొమ్మిది రోజుల ఉత్స‌వాల నిర్వ‌హ‌ణపై సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నిమ‌జ్జ‌నానికి సంబంధించి మండ‌ప నిర్వాహ‌కుల బాధ్య‌తలపై పలు సూచనలు చేశారు.

ఉత్సవాల విషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రభుత్వ శాఖలు-నిర్వహకుల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌ లో అనుమతులు తీసుకోవాలన్నారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.


ALSO READ: హైడ్రాకు ఎంపీ అనిల్ 25 లక్షల విరాళం

ప్రాంతాలవారీగా నిమజ్జనానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని  పోలీసులకు సూచించారు. ప్రతి ఏరియాలో కో-ఆర్డినేషన్ కమిటీల నిర్వహణ ద్వారా మరింత తేలిక అవుతుందన్నారు. వీవీఐపీ సెక్యూరీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

నిమజ్జనానికి సంబంధించి ఉత్సవ నిర్వాహకుల నుంచి సహకారం అవసరం చెబుతూనే, త్వ‌ర‌గా ప్రారంభిస్తే కార్య‌క్ర‌మాన్ని సాఫీగా ముగించుకోవ‌చ్చ‌నన్నారు. ఫ‌లితంగా భక్తులు ట్రాఫిక్‌, ఇత‌ర ఇబ్బందులు బారిన ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చ‌న్నారు.

సెప్టెంబ‌రు 16న మిలాద్ ఉన్ న‌బీ, 17న తెలంగాణ‌లో వివిధ రాజ‌కీయ పార్టీలు ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే అవకాశాలు ఉన్నందున సరైన ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగాల‌ని, ఎక్క‌డా స‌మ‌స్య త‌లెత్త‌కుండా చూసుకోవాల‌ని పోలీసులను ఆదేశించారు ముఖ్యమంత్రి.

ముఖ్యంగా అందరి సలహాలు, సూచనలు స్వీకరించేందుకే ఈ సమావేశం నిర్వహించామన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణకు చాలా కీలకమైందని, రాజకీయ, రాజకీయేతర కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలనన్నారు.

గణేష్ ఫెస్టివల్ సందర్భంగా గతేడాది లక్షా 50 వేల విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. సంఖ్య ఈసారి పెరిగే అవకాశముందని ప్రభుత్వ పెద్దలు అంచనా. అయితే వినాయక చవితి మొదలు నిమజ్జనం వరకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నది ముఖ్య ఉద్దేశం.

అలాగే విగ్రహాలు నిమజ్జనం కేవలం హుస్సేన్ సాగర్‌కే పరిమితం కాకుండా మిగతా ప్రాంతాల్లోని చెరువుల్లోనూ నిమజ్జనం చేయనున్నారు. దీనివల్ల సాగర్‌కి వద్ద రద్దీ తగ్గుతుందన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చెరువుల గురించి వివరించారు అధికారులు.

 

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×