BigTV English

BCCI : స్వదేశంలో సిరీస్ లు.. షెడ్యూల్ విడుదల.. హైదరాబాద్‌, విశాఖలో మ్యాచ్ లు..

BCCI : స్వదేశంలో సిరీస్ లు.. షెడ్యూల్ విడుదల.. హైదరాబాద్‌, విశాఖలో మ్యాచ్ లు..

BCCI : టీమిండియా సెప్టెంబర్ నుంచి సొంతగడ్డపై ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. 6 నెలల వ్యవధిలో ఆడే మ్యాచ్ ల వివరాలు వెల్లడించింది. భారత్‌ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్‌లో ప్రాధాన్యం దక్కని వేదికల్లో ఎక్కువ మ్యాచ్ లు జరగనున్నాయి. అక్టోబర్ లో ప్రపంచకప్‌ ప్రారంభమవుతుంది. ఈ మెగా టోర్నికి ముందు భారత్ జట్టు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. సెప్టెంబర్ 22, 24, 27 తేదీల్లో ఈ మ్యాచ్‌లు మొహలి, ఇండోర్‌, రాజ్‌కోట్‌ లో నిర్వహిస్తారు.


ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాతోనే 5 టీ20ల సిరీస్‌ ఆడుతుంది. నవంబర్ 23న తొలి మ్యాచ్‌ విశాఖలో, డిసెంబర్ 3న ఐదో టీ20 హైదరాబాద్‌ లో నిర్వహిస్తారు. నవంబర్ 26, 28, డిసెంబర్ 1 తేదీల్లో మిగతా టీ20లు తిరువనంతపురం, గోహతి, నాగ్‌పూర్‌ లో జరుగుతాయి.

అఫ్గానిస్థాన్‌తో జనవరి 11, 14, 17 తేదీల్లో భారత్‌ 3 టీ20 మ్యాచ్ లు ఆడుతుంది. మొహలి, ఇండోర్‌, బెంగళూరులో ఈ మ్యాచ్ లు నిర్వహిస్తారు. జనవరి చివరిలో ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ప్రారంభమవుతుంది. తొలి టెస్టు హైదరాబాద్‌లో జనవరి 25-29 మధ్య జరుగుతుంది. రెండో టెస్టు విశాఖలో ఫిబ్రవరి 2-6 మధ్య నిర్వహిస్తారు. మిగిలిన 3 టెస్టులు రాజ్‌కోట్‌, రాంచి, ధర్మశాల వేదికగా జరుగుతాయి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×