BigTV English

Pawan Kalyan : పవన్‌పై డిఫమేషన్ కేసు.. పిటిషన్‌ రిటర్న్.. విజయవాడ సివిల్‌ కోర్టు నిర్ణయం..

Pawan Kalyan : పవన్‌పై డిఫమేషన్ కేసు.. పిటిషన్‌ రిటర్న్.. విజయవాడ సివిల్‌ కోర్టు నిర్ణయం..
Pawan kalyan latest news in telugu

Pawan kalyan latest news in telugu(Andhra news today) : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దాఖలైన క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్‌ను రిటర్న్ చేసింది విజయవాడ సివిల్‌ కోర్టు. జనసేనాని ఏలూరు జరిగిన వారాహి యాత్రలో వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆయనపై ఓ మహిళా వాలంటీర్ ఈ పిటిషన్ కోర్టులో దాఖలు చేశారు.


అయితే పిటిషన్‌ తమ పరిధిలోకి వస్తుందో రాదో స్పష్టం చేయాలని విజయవాడ సివిల్ కోర్టు ఆదేశించింది. అలాగే వాలంటర్ కి సంబంధించిన ఒరిజినల్‌ అపాయింట్‌మెంట్‌ తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. అలాగే డిఫమేషన్‌ పిటిషన్‌ విజయవాడ కోర్టులో దాఖలు చేయడానికి కారణాలేంటో చెప్పాలని ఆదేశించింది.

ఏలూరులో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో వాలంటీర్లు సంఘవిద్రోహ శక్తులకు డేటా ఇస్తున్నారంటూ కామెంట్‌ చేశారు పవన్‌. అంతేకాదు వాలంటీర్ల కారణంగా రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు కనిపించకుండపోయారని ఆరోపించారు. వాలంటీర్ల ప్రతిష్ఠకు పరువు నష్టం కలిగేలా పవన్‌ వ్యాఖ్యలు చేశారని ఐపీసీ సెక్షన్‌ 500, 504, 505 సెక్షన్ల కింద శిక్షించాలని కోరుతూ విజయవాడ శాంతినగర్‌కు చెందిన రంగవల్లి అనే వాలంటీర్ విజయవాడ సివిల్‌ కోర్టు లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు తాజాగా ఈ ఆదేశాలు ఇచ్చింది.


Related News

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

Big Stories

×