Pakistan : ఆసియా కప్ 2025 లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రిఫరీ పై క్రాప్ట్ ను తొలగించాలని పీసీబీ చేసిన ఫిర్యాదును రిజెక్ట్ చేసినట్టు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆసియా కప్ నుంచి తప్పుకుంటామన్న పాక్ కి ఘోర అవమానం ఎదురైంది. మొన్న గ్రౌండ్ లో టీమిండియా ఆటగాళ్లు.. పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు పీసీబీకి భంగపాటు తప్పలేదు. మరోవైపు సోషల్ మీడియాలో పాకిస్తాన్ పై మాట మీద నిలబడి టోర్నీ నుంచి తప్పుకుంటే.. పాకిస్తాన్ కి కనీస మర్యాదైనా దక్కుతుందేమో అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.
Also Read : Mohammed Siraj : ప్రధాని మోడీపై సిరాజ్ సంచలన వ్యాఖ్యలు…మా స్ఫూర్తికి !
ఇవాళ పాకిస్తాన్ కి యూఏఈతో జరిగే మ్యాచ్ కీలకం కానుంది. అయితే మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాప్ట్ ను తొలగించకపోతే.. ఈ మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ గతంలో బెదిరించింది. కానీ రిఫరీని తొలగించబోమని ఐసీసీ స్పష్టంగా చెప్పడంతో.. చేసేది ఏమి లేక పాకిస్తాన్ ఆటగాళ్లు ఇవాళ ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రధానంగా ఐసీసీ నుంచి ఎదురుదెబ్ పాకిస్తాన్ ను కాస్త ఇబ్బంది పుట్టింది. ఇప్పుడు అది నిశ్శబ్దంగా మ్యాచ్ కు సన్నాహాలు ప్రారంభించింది. ఐసీసీ తిరస్కరించిన పాకిస్తాన్ డిమాండ్ పై గతంలో పీసీబీ సీఈవో గా పని చేసిన దాని జనరల్ మేనేజర్ వసీంఖాన్ కూడా స్వయంగా సంతకం చేశారని నివేదికల్లో వెల్లడైంది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రతిష్టను కాపాడే చర్యగా నిరూపించుకునే ప్రయత్నంలో యూఏఈ మ్యాచ్ కి రిచీ రిచర్డ్ సన్ ను రిఫరీగా నియమించాలని పీసీబీ ఇప్పటికీ ఐసీసీని కోరుతోంది.
Also Read : Shahid Afridi : రాహుల్ గాంధీని మెచ్చుకున్న పాకిస్తాన్ క్రికెటర్.. హిందూ మతం పేరుతో అంటూ !
మరోవైపు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తో నఖ్వీ సమావేశం హోం మంత్రిత్వ శాఖ సమస్యల గురించే అని.. ఆసియా కప్ బహిష్కరణకు సంబంధించినది కాదని.. పలు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నుంచి వైదొలిగితే.. దాదాపు రూ.$ 16 మిలియన్లు నష్టపోతుంది. అంటే సుమారు రూ. 140 కోట్లకు పైగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో పీసీబీకీ భారీ దెబ్బ అవుతుంది. పీసీబీ బీసీసీఐ అంత సంపన్నమైన బోర్డు కాదు.. మరోవైపు నిన్న జరగాల్సిన ప్రెస్ మీట్ ను రద్దు చేసింది పాకిస్తాన్. జట్టు శిక్షణకు దూరంగా ఉందనే ఊహగానాల మధ్య ఆటగాళ్లు మైదానానికి చేరుకోవడం గమనార్హం. ఇక టోర్నీ నుంచి తప్పుకుంటే.. తీవ్ర నష్టం వాటిళ్లనుంది. మరోవైపు ఇవాళ యూఏఈతో విజయం సాధిస్తే.. పాకిస్తాన్ ఈనెల 21న మరోసారి టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే.. పాకిస్తాన్ జట్టు మిగతా జట్లతో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.