E-Paper
Advertisement

Kamran Akmal: అల్లా మీద ఒట్టు..ఇవాళ్టి మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది

Kamran Akmal: అల్లా మీద ఒట్టు..ఇవాళ్టి మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది
Advertisement

Kamran Akmal: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. శ్రీలంకలోని కొలంబో ప్రేమ దాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ పరువు తీశాడు ఆ జట్టుకు సంబంధించిన మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్. కొన్ని కోట్ల మంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాడని వెల్లడించారు. కానీ ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోవడం గ్యారెంటీ అంటూ బాంబు పేల్చారు కమ్రాన్ అక్మాల్. అల్లా మీద ఒట్టు ఇది రాసి పెట్టుకోండి అంటూ సవాలు కూడా చేశారు కమ్రాన్ అక్మల్ ( Kamran Akmal). ఓ టీవీ డిబేట్ లో కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Also Read: AUS vs ZIM-IND WC Wins: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓట‌మి..టీమిండియానే ఈ సారి ఛాంపియ‌న్‌…ఊరిస్తోన్న 1983, 2007 సెంటిమెంట్‌

అల్లా మీద ఒట్టు..ఇవాళ్టి మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ రాత్రి కొలంబో వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా టీమిండియా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనికి తగ్గట్టుగానే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కూడా వ్యాఖ్యలు చేశారు. కొలంబో వేదికగా జరిగే ఇవాల్టి మ్యాచ్ లో కచ్చితంగా టీమిండియా హాట్ ఫేవరెట్ గా ఉందని వివరించారు. పాకిస్తాన్ పైన టీమిండియా విజయం సాధించడం గ్యారంటీ అన్నారు. దీనికి ప్రత్యేక కారణాలను కూడా కమ్రాన్ అక్మల్ డిబేట్ లో వెల్లడించారు. 2024 టీ20 ప్రపంచ కప్ నుంచి ఇప్పటి వరకు ఇండియా ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదని గుర్తు చేశారు.

సూర్య కుమార్ కెప్టెన్సీలో టీమిండియా టి20 లో అదరగొడుతుందని వెల్లడించారు. ఈ లెక్కన చూసుకున్నట్లయితే పాకిస్తాన్ పైన టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు హింట్ ఇచ్చారు కమ్రాన్ అక్మల్. అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ గెలిచే అవకాశాలు లేదని కుండ బద్దలు కొట్టారు. కానీ పాకిస్తాన్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదని గుర్తు చేశారు. పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ లో టీమిండియా ప్లేయర్లు ఆడడం పైన మ్యాచ్ ఫలితం ఉంటుందని వివరించారు కమ్రాన్ అక్మల్. ఉస్మాన్ తారిక్ మ్యాజిక్ చేస్తే మాత్రం టీమిండియా చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఇవాళ చూడవచ్చు అన్నారు. ఇండో-పాక్ మ‌ధ్య ఇప్ప‌టి వ‌ర‌కు 16 టీ20లు జ‌రిగాయి. ఇందులో టీమిండియా 13 మ్యాచ్ ల్లో విజ‌యం సాధించింది ఇండియా. కేవ‌లం 3 మ్యాచ్ ల‌లో పాకిస్తాన్ గెలిచింది.

Advertisement

Also Read: Inzamam ul haq: రేపటి మ్యాచ్ లో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే, BCCIని రోడ్డుకు ఈడ్చుతా… ఇంజమామ్ హాట్ కామెంట్స్

 

 

Related News

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

Big Stories

Advertisement
×