E-Paper
Advertisement

Luan :క్లబ్‌లో ప్లేయర్‌పై దాడి.. స్వల్ప గాయాలు..

Luan :క్లబ్‌లో ప్లేయర్‌పై దాడి.. స్వల్ప గాయాలు..
Advertisement
Luan

Luan : ఫ్యాన్స్‌కు తమ అభిమాన హీరోలన్నా, క్రీడాకారులన్నా చాలా ఇష్టం. ఒక్కొక్కసారి ఆ అభిమానం హద్దులు దాటి.. ఇతరులతో గొడవలు కూడా జరుగుతాయి. అలాగే మరికొన్ని సందర్భాల్లో ఆ అభిమానం అనేది తాము అభిమానించే మనిషితోనే గొడవ పడేలా చేస్తుంది. తాజాగా ఒక సాకర్ ప్లేయర్ ఫ్యాన్స్ తనతో అలాగే వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా తనపై దాడి కూడా చేశారు. దీంతో ఆ క్రీడాకారుడికి స్పల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

Advertisement

బ్రెజిలియన్ సాకర్ క్లబ్ అయిన కారింథియాన్స్ టీమ్‌కు చెందిన యంగ్ ఆటగాడు, మిడ్‌ఫీల్డర్ లియాన్.. తాజాగా ఒక క్లబ్‌లో తన టీమ్‌తో పార్టీ చేసుకున్నాడు. అదే సమయంలో అక్కడికి కొంతమంది ఫ్యాన్స్ వచ్చారు. వారితో ల్యూయాన్‌కు వాగ్వాదం జరిగింది. దీంతో వారు ఆగ్రహంతో ల్యూయాన్‌పై దాడిచేశారు. 2016లో బ్రెజిల్ తరపున ఒలింపిక్స్ గోల్డ్ మెడల్‌కు గెలుచుకున్నాడు ల్యూయాన్. అలాంటి యంగ్ ఆటగాడికి ఇలా జరగడం బాధాకరంగా ఉందంటూ తన కారింథియాన్స్ టీమ్ స్పందించింది. అంతే కాకుండా ఆ క్లబ్ ఓనర్లు కూడా ఈ ఘటనను తీవ్రంగా స్పందించారు.

బ్రెజిలియన్ సాకర్‌లో ఇలాంటి హింసాత్మక ఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి. ఫ్యాన్స్ వల్ల పలుమార్లు అథ్లెట్స్ ఇబ్బందులు పడ్డారు. అందుకే ల్యూయాన్‌పై జరిగిన దాడి ఘటనపై కారింథియన్స్ ఆగ్రహంతో ఉన్నారు. యంగ్ ఆటగాడిగా ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలుచుకున్న తర్వాత ల్యూయాన్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్‌ను తృప్తి పరచలేకపోయింది. దీంతో దాడికి ఇది కూడా ఒక కారణం కావచ్చని పలువురు భావిస్తున్నారు. ల్యూయాన్ మాత్రం ఈ ఘటనపై ఏ విధంగానూ స్పందించలేదు. అంతే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు రాలేదు.

Advertisement

సౌత్ అమెరికా టీమ్‌లో తన సత్తాను చాటుకున్న ల్యూయాన్.. 2020లో సా పాలో క్లబ్‌లో జాయిన్ అయ్యాడు. అప్పటినుండి తన ఆటతీరు పూర్తిగా మారిపోయింది. గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వలేక ఇబ్బందులు పడ్డాడు. ఇక సా పాలో క్లబ్‌తో ల్యూయాన్ చేసుకున్న ఒప్పందం మరో ఆరు నెలల్లో ముగిసిపోనుంది. కారింథియన్స్ తరపున ల్యూయాన్ 80 ఆడలు ఆడగా.. అందులో 11 గోల్స్ చేశాడు. ప్రస్తుతం బ్రెజిల్ లీగ్ టీమ్‌లో తన స్థానాన్ని కాపాడుకోవడానికి కష్టపడుతున్నాడు ఈ యంగ్ ఆటగాడు.

Related News

ఇంగ్లాండ్ కొంప‌ముంచిన DRS…షాబాద్ ఖాన్ సెంచ‌రీతో పాకిస్తాన్ విజ‌యం

బాబ‌ర్ ఆజం పెద్ద జోక‌ర్…పాకిస్తాన్ జ‌ట్టు నుంచి త‌రిమేయండి

అర్ధ‌రాత్రి 2 గంట‌ల‌కు ద్రవిడ్ కు ఫోన్ చేసి, బూతులు తిట్టిన క్రికెట‌ర్!

మీరు మగాళ్లయితే, ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసి 250 ప‌రుగులు చేయండి!

న్యూజిలాండ్ లో టీమిండియా క్రికెట‌ర్ల‌కు ఫుడ్ క‌ష్టాలు…పాములు, తేళ్లు, గ‌బ్బిపాలు!

వాంఖ‌డే స్టేడియంలో ముంబై జెర్సీలే క‌న‌బ‌డాలి…కీరన్ పొలార్డ్ హుకుం

30 ప‌రుగుల‌తో టీమిండియా ఓడిపోయేది…కానీ బీసీసీఐ కుట్ర‌ల‌తోనే గెలిచారు!

ఇది రా తెలుగోడి బ్రాండ్.. తిల‌క్ వ‌ర్మపై ఈగ కూడా వాల‌నివ్వ‌కుండా సెక్యూరిటీ?

Big Stories

Advertisement
×