BigTV English

Brazilian Swimmer Ana Vieira Sent Home: పారిస్ ఒలింపిక్స్.. ప్రియుడితో ఎంజాయ్.. పోటీల నుంచి స్విమ్మర్ ఔట్

Brazilian Swimmer Ana Vieira Sent Home: పారిస్ ఒలింపిక్స్.. ప్రియుడితో ఎంజాయ్.. పోటీల నుంచి స్విమ్మర్ ఔట్

Brazilian Swimmer Ana Vieira Sent Home: ఆటగాళ్లకు సరైన గుర్తింపు వచ్చేది కేవలం ఒలింపిక్స్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 పైగా దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొంటాయి. ఒక్క పతకం గెలిస్తే చాలని అనుకునేవారు చాలామంది ఉంటారు. లైఫ్‌లో సక్సెస్ సాధించామని భావిస్తున్నారు. ఇందుకోసం నిద్రలేని రాత్రళ్లు గడుపుతారు. ఎన్నో కష్టనష్టాలు అనుభవిస్తారు. మరికొందరైతే పోటీల్లో ఏముంది? తమ కు పర్సనల్ లైఫ్ ముఖ్యమని అనుకున్నవాళ్లూ లేకపోలేదు. అలాంటి వారిలో బ్రెజిల్ స్విమ్మర్ అనా వియిరా ఒకరు.


బ్రెజిల్ స్విమ్మర్ అనా వియిరా పేరు పారిస్ ఒలింపిక్స్‌లో మార్మోగింది. కేవలం 22ఏళ్లు మహిళా స్విమ్మర్. తనకు ఆటలకంటే వ్యక్తిగత జీవితం ముఖ్యమని భావించింది. అసలే ఫ్యాషన్ ప్రియులకు కేరాఫ్ పారిస్. అలాంటి ప్రాంతంలో ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకుంది అనా వియిరా. తన పోటీలకు ముందురోజు ప్రియుడి‌తో దొంగచాటుగా బయటకు వెళ్లింది.. ఎంజాయ్ చేసింది.

ఒలింపిక్స్‌కు వచ్చిన ఆటగాళ్లు వారికి కేటాయించిన క్రీడాగ్రామం నుంచి బయటకు వెళ్లకూడదు. అది ఆటగాళ్లకు వర్తించే ప్రధాన నియమం. ఆ విషయాన్ని తుంగలోతొక్కింది అనా వియిరా. ప్రియుడు శాంటోస్‌తో నైటంతా ఎంజాయ్ చేసింది. పారిస్ ప్రధాన వీధులన్నీ చక్కబెట్టింది. లైఫ్‌లో ఊహించని ఎంజాయ్ చేసింది. ఈమె వ్యవహారం బయటకుపొక్కింది. దీంతో బ్రెజిల్‌కు చెందిన అనా వియిరాను ఒలింపిక్స్ విలేజ్ నుంచి ఇంటికి పంపించేశారు నిర్వాహకులు.


వియిరా-శాంటోస్ ఇద్దరు బ్రెజిల్ స్విమ్మర్లు.. రిలే 4 x 400 మీటర్లలో ఆటగాళ్లు. ఈ విషయం తెలిసి ఆర్గనైజర్లు వీరిపై కన్నెర్ర చేశారు. శాంటోస్ రిక్వెస్ట్ చేయడంతో ఆయన్ని మందలించి వదిలేశారు. కానీ, వియిరా ఏ మాత్రం వెనక్కితగ్గలేదు. అధికారులతో దురుసుగా ప్రవర్తించింది. వెంటనే ఆమెను బ్రెజిల్ పంపించేశారు. మరో విషయం ఏంటంటే.. ముందురోజు నైట్ అవుట్ చేసిన వియిరా-శాంటోస్ లవర్స్, తమ తమ ఈవెంట్లలో ఓటమి పాలయ్యారు.

ALSO READ: ఈ మనుబాకర్ ఎవరు?

ఈ వ్యవహారంపై వియిరా రియాక్ట్ అయ్యింది. తన ఐటెమ్స్ ఇంకా ఒలింపిక్స్ విలేజ్‌లో ఉన్నాయని గుర్తు చేసింది. తనపై జరిగిన ఈ వేధింపుల గురించి కమిటీకి ఫిర్యాదు చేసింది. అయినా సమస్య పరిష్కారం కాలేదని, తాను లాయర్లతో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించింది. దటీజ్ అనా వియిరా..మజాకా?

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×