BigTV English

Budweiser-Virat : మందు బాబులకు గుడ్ న్యూస్.. కోహ్లీ పేరుతో కొత్త బీర్లు!

Budweiser-Virat : మందు బాబులకు గుడ్ న్యూస్.. కోహ్లీ పేరుతో కొత్త బీర్లు!
Advertisement

Budweiser-Virat : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ 18 నెంబర్ జెర్సీ ధరిస్తాడనే విషయం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆయన ధరించే జెర్సీకి మరో ప్రత్యేక గుర్తింపు కూడా రానుంది. ఇక నుంచి కోహ్లీ ధరించే 18 జెర్సీతో బడ్వైజర్ కంపెనీ కొత్త బీర్లను తయారు చేయనున్నట్టు సమాచారం. విరాట్ కోహ్లీ క్రికెట్ వారసత్వాన్ని గౌరవించేందుకు బడ్‌వైజర్ “18” అనే ప్రత్యేక ఎడిషన్ బీర్‌ను విడుదల చేసింది. ఈ బీర్ అతని విజయాలు, క్రీడపై శాశ్వత ప్రభావం..   క్రికెట్ మైదానంలో కోహ్లీకి ఉన్న సాటిలేని వారసత్వానికి నివాళిగా ఈ బీర్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఈ బీర్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Also Read :

ఇక విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టీమిండియా, ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. ఇక మైదానంలోకి దిగిన ప్రతిసారీ కూడా కింగ్ కోహ్లీ 18 నంబర్ ఉన్న జెర్సీని ధరిస్తాడు.  2008లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో కూడా విరాట్ కోహ్లీ 18వ నంబర్ జెర్సీనే ధరించాడు. తన నాయకత్వంలో జట్టును చాంపియన్‌గా కూడా మార్చాడు. ఆపై అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేసిన తర్వాత కూడా కోహ్లీ 18 నంబర్ జెర్సీని మాత్రమే ధరిస్తున్నాడు. అసలు ఆ 18 నంబర్ ప్రత్యేకత ఏమిటి..? ఆ నంబర్‌తో కోహ్లీకి సంబంధం ఏమిటి..? ఎప్పుడూ మైదానంలో సరదాగా, సీరియస్‌గా ఉండడమే తప్ప బాధపడని కోహ్లీకి ఆ నంబర్‌తో ఓ ప్రత్యేకమైన బంధం ఉంది. నిజానికి ఈ నంబర్ జెర్సీని కోహ్లీ ధరించడం వెనుక ఓ ఎమోషనల్ రీజన్ ఉందండోయ్.


2008 అండర్ 19 ప్రపంచకప్‌కు ముందు అంటే.. 2006 డిసెంబర్ 18న కోహ్లీ తండ్రి అయిన ప్రేమ్ కోహ్లీ మరణించారు. తన తండ్రి చనిపోయే సమయానికి 17 ఏళ్ల వయసున్న కోహ్లీ కర్ణాటకతో ఢిల్లీ తరఫున రంజీ ఆడుతున్నాడు. ఈ వార్త తెలిసినప్పటికీ జట్టు కోసం తన విధిని పూర్తి  చేసే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన తల్లి, కోచ్‌లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్న కోహ్లీ ఆ మ్యాచ్‌లో 90 పరుగులు చేశాడు. అనంతరం తన తండ్రి జ్ఞాపకార్థం 18వ నంబర్ జెర్సీని ధరించాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడట విరాట్ కోహ్లీ. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్బుతమైన ఫామ్ లో కొనసాగుతోంది. మొత్తానికి ఈ సారి టైటిల్ ఆర్సీబీ గెలుచుకుంటుందని పలువురు విరాట్ అభిమానులు పేర్కొంటున్నారు. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్రస్తుతం టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాయి. ఢిల్లీ విజయం సాధిస్తే.. రేస్ లోకి వచ్చే అవకాశముంది. దాదాపు మిగతా టీమ్ లు అన్నీ కూడా ప్లే ఆప్స్ నుంచి తప్పుకోనున్నాయి. కోల్ కతా, లక్నో సూపర్ జెయింట్స్ కి కూడా మిగతా జట్ల పై ఆధారపడాల్సి ఉంది.

Related News

Ban On Pakistan: అఫ్ఘ‌నిస్తాన్ దెబ్బ అద‌ర్స్‌.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి పాకిస్తాన్ ఔట్ ?

Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండ‌టం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే ప‌నులు ?

INDW vs ENGW: స్మృతి , హర్మన్ పోరాటం వృధా…సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్..టీమిండియాకు ఇంకా ఛాన్స్‌

Mitchell Starc: 176.5 కిమీ వేగంతో స్టార్క్ బౌలింగ్‌..షోయ‌బ్ అక్త‌ర్ 22 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు

IND VS AUS: టీమిండియా కొంప‌ముంచిన వ‌రుణుడు..పెర్త్ లో ఆసీస్ విక్ట‌రీ

Smriti Mandhana Wedding: పెళ్లి చేసుకోబోతున్న లేడీ కోహ్లీ…వ‌రుడు ఎవ‌రో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

IND VS AUS: 26 ఓవ‌ర్ల‌కు మ్యాచ్ కుదింపు..చెమ‌టోడ్చిన టీమిండియా..ఆసీస్ టార్గెట్ ఎంతంటే

IND VS AUS: భారీ వ‌ర్షం, 35 ఓవ‌ర్ల‌కు మ్యాచ్ కుదింపు..Popcorn తింటూ రోహిత్‌, గిల్ రిలాక్స్‌

Big Stories

×