BigTV English

China Spy Ship: భారత జలాల్లో చైనా గూఢచారి నౌక.. పాకిస్థాన్‌కు సాయం కోసమేనా..?

China Spy Ship: భారత జలాల్లో చైనా గూఢచారి నౌక.. పాకిస్థాన్‌కు సాయం కోసమేనా..?

China Spy Ship: భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్, పీవోకేలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 100 మందికి పైగా టెర్రరిస్టులను హతం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు అమెరికా జోక్యంతో భారత్ -పాక్ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా జరిగిన తర్వాత దేశ సరిహద్దుల్లోని భారత్ జలాల్లో చైనాకు చెందిన గూఢచారి నౌక ‘Da Yang Yi Hao’ కదలికలు కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నౌక భారత్ జలాల్లో కనిపించడంతో పాక్- చైనా బంధానికి బలం చేకూరేలా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే భారత్ త్రివిధ దళాల అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.


భారత్ లో ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో చైనాకు చెందిన గూఢచారి నౌక భారత జలాల్లో కనిపించడంతో ప్రస్తుతం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ గుఢాచారి నౌకను ఉపయోగించి భారత నౌకల కదలికలు, నిఘా, జలాంతర్గాముల కదలికల రహస్యాలను తెలుసుకునే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది.  ఆపరేషన్ సిందూర్ తర్వాత హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రంలో నార్త్ వైపు భారత్ నౌకాదళం యాక్టివ్ అయిన విషయం తెలిసిందే. ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు, జలాంతర్గములను భారత్ మోహరించింది.

అయితే చైనా గూఢాచారి నౌకకు ఉన్న అధునాతన సెన్సార్లతో భారత్ యుద్ధ నౌకల కదలికలను ఈజీగా పసిగట్టే ఛాన్స్ ఉంది. చైనా మిత్ర దేశమైన పాక్ కు తమ సపోర్ట్ ఉందని సంకేతాలు పంపేందుకు.. భారత్ రహస్యాలను తెలుసుకునేందుకు గూఢాచారి నౌకను ఉపయోగించవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాగే దాయాది దేశం పాక్ లోని కరాచీపై భారత్ దాడి చేస్తుందేమో అన్న భయంతో.. ముందస్తుగానే పసిగట్టి, సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్ కు చేరవేసేలా ఈ మోహరింపు ఉండొచ్చని కొందరు చెబుతున్నారు.


చైనా ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (BRI) కింద చైనా- పాక్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణ (China-Pakistan Economic Corridor) ప్రక్రియ జరుగుతోంది. పీవోకే మీదుగా సీపెక్ ప్రాజెక్ట్ చేపట్టడంపై భారత్ ఫస్ట్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ పనులు కంప్లీట్ కావాలంటే.. పాక్ లో పొలిటికల్, ఫైనాన్షియల్ గా మంచి పరిస్థితులు ఉండడం డ్రాగన్ కు అత్యంత కీలకం. అది రహస్య కారణాలు కూడా అయ్యి ఉండొచ్చు. ఈ గూఢాచారి నౌక భారత నౌకాదళ విభాగాల మధ్య సమాచారానికి అడ్డంకులు సృష్టించగల అవకాశం లేకపోలేదు.

Also Read: BJP on Pakistan : ఆపరేషన్ సిందూర్.. పాకిస్థాన్ చుక్కలు చూపించారుగా.. ఒక్కటి మిస్ కాలేదు !

యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ లో అత్యంత కీలకమైన జలాంతర్గాముల రాకపోకలను ఇది మ్యాప్‌ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే ఇక్కడ సేకరించిన సమాచారాన్ని పాక్‌ లో నిర్మించాలనుకుంటున్న మిలిటరీ లాజిస్టిక్స్ బేస్‌ కోసం కూడా వాడుకోవచ్చు. హిందూ మహా సముద్రంలో ఇలా చైనా  గూఢాచారి నౌకల కదలికలు ఉండటం ఇదే ఫస్ట టైం కాదు. ఇంతకముందు కూడా భారత జలాల్లో చైనా నౌకలు కనిపించాయి. గతేడాది యువాన్‌ వాంగ్‌-6 వంటి నౌకలు హిందూమహా సముద్రంలో కనిపించాయి. ఈ ప్రాంతంతో భారత ఆధిపత్యాన్ని సవాలు చేసే లక్ష్యంగానే ఈ చర్యలు ఉన్నాయనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. అసలు చైనాకు చెందిన ఈ గూఢచారి నౌక భారత్ జలాల్లోకి ఎందుకు మోహరించారో ఓ క్లారిటీ రావాల్సి ఉంది. భారత నౌకాదళ రహస్య సమాచారం కోసమా..? పాకిస్థా‌న్ కు సాయం చేసేందుకా..? అన్న అనుమానాలు భారీగా వ్యక్తం అవుతున్నాయి.

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×