BigTV English

Cameroon shocked Serbia : సెర్బియాకు షాకిచ్చిన కామెరూన్

Cameroon shocked Serbia : సెర్బియాకు షాకిచ్చిన కామెరూన్

Cameroon shocked Serbia : ఫిఫా వరల్డ్‌కప్‌లో మరో పెద్ద జట్టుకు షాక్ తప్పలేదు. గ్రూప్-Gలో భాగంగా సెర్బియా-కామెరూన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయింది. అయితే రెండు జట్లూ… చెరో మూడు గోల్స్ చేయడం విశేషం.


ఆట ఆరంభమైన దాదాపు అరగంటకు… తొలి గోల్ కామెరూన్ ఖాతాలోనే చేరింది. 29వ నిమిషంలో ఆటగాళ్ల తలలను తాకుతూ వచ్చిన కార్నర్‌ కిక్‌ను… గోల్‌ పోస్ట్ దగ్గరే ఉన్న జియాన్‌ ఛార్లెస్‌… నెట్లోకి పంపి గోల్‌గా మలిచాడు. అయితే 1-0 ఆధిక్యంలో నిలిచామన్న ఆనందం కామెరూన్‌కు ఎక్కువసేపు నిలవలేదు. ఒక్కసారిగా దూకుడు పెంచిన సెర్బియా… నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్‌ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి అర్ధభాగం ముగిశాక రిఫరీ 6 నిమిషాల అదనపు సమయం ఇవ్వడంతో… మొదటి నిమిషంలో పావ్లోవిచ్‌, మూడో నిమిషంలో మిలింకోవిచ్‌ వెంటవెంటనే గోల్స్‌ కొట్టారు. దాంతో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 2-1 ఆధిక్యంలో నిలిచింది… సెర్బియా.

రెండో అర్ధభాగంలోనూ దూకుడుగా ఆట మొదలెట్టింది… సెర్బియా. 53వ నిమిషంలో మిత్రోవిచ్ చేసిన గోల్‌తో ఆ జట్టు 3-1తో ఆధిక్యం సాధించింది. దాంతో… సెర్బియా విజయం ఖాయమని ఆటగాళ్లు, ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. కానీ… ఆఫ్రికన్‌ కప్‌ ఆఫ్‌ నేషన్స్‌లో అత్యధిక గోల్స్‌ కొట్టిన ఆటగాడిగా నిలిచిన అబూబాకర్‌… సెర్బియా ఆశలపై నీళ్లుచల్లాడు. 63వ నిమిషంలో ఆ జట్టు గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ… అతని తల మీదుగా, తెలివిగా బంతిని నెట్‌లోకి పంపించాడు… అబూబాకర్. అయితే ఆఫ్‌సైడ్‌ అని రిఫరీ గోల్‌ ఇవ్వలేదు. కానీ వీడియో సమీక్షలో కామెరూన్‌కు గోల్‌ దక్కింది. ఆ జట్టు సెర్బియా ఆధిక్యాన్ని 2-3కు తగ్గించింది. మరో మూడు నిమిషాలకు… ప్రత్యర్థి రక్షణశ్రేణిని ఛేదించి గోల్‌పోస్ట్ దాకా బంతిని తీసుకెళ్లిన అబూబాకర్‌.. దాన్ని లెఫ్ట్ సైడ్ ఉన్న ఎరిక్‌ మాక్సిమ్‌కు అందించాడు. అతను ఎలాంటి పొరపాటు చేయకుండా నెట్లోకి పంపడంతో… కామెరూన్ ఖాతాలో మూడో గోల్ చేరింది. ఆ తర్వాత నిర్ణీత సమయం ముగిసేలోగా రెండు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. దాంతో 3-3తో మ్యాచ్ డ్రా అయింది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×