BigTV English

Chamari Becomes first to hit hundred: ఉమెన్స్ ఆసియా కప్‌లో తొలి రికార్డ్.. సెంచరీ చేసిన చమరి

Chamari Becomes first to hit hundred: ఉమెన్స్ ఆసియా కప్‌లో తొలి రికార్డ్.. సెంచరీ చేసిన చమరి

Women’s Asia Cup T20 2024: మహిళల ఆసియాకప్ టీ20 టోర్నమెంట్ లో శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు అదరహో అనిపించింది. బాల్‌ను బౌండరీ దాటిస్తూ మలేసియా ఆటగాళ్లకు చుక్కలు చూపించింది. దీంతో ఉమెన్స్ ఆసియా కప్‌లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డును సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో చమరి (119- 69 బంతుల్లో 7 సిక్స్ లు, 14 ఫోర్లు) చేసింది.


కాగా, ఈ మ్యాచ్‌లో మలేసియాపై శ్రీలంక 144 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, మహిళల టీ20 క్రికెట్ లో శ్రీలంకకు పరుగుల పరంగా ఇదే భారీ విజయం. శ్రీలంక మొదటగా బ్యాటింగ్ చేసింది. చమరి ఆటపట్టు సెంచరీ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు తీసింది. అనుష్క సంజీవని – 31, హర్షిత మాధవి – 26 పరుగులు తీసి ఫర్వాలేదనిపించారు.

Also Read: గిల్ ఏమీ శాశ్వతం కాదు: అజిత్ అగార్కర్


లక్ష్యఛేదనలో శ్రీలంక బౌలర్లధాటికి మలేసియా బ్యాటర్లు డీలా పడ్డారు. ఆ జట్టు 19.5 ఓవర్లలో 40 పరుగులకే కుప్పకూలిపోయింది. ఎల్సా హంటర్ మాత్రమే 10 పరుగులు తీసింది. నలుగురు ప్లేయర్లు డకౌట్ అయ్యారు. నజ్వా – 9, మహిరా -7, జూలియా – 3, హాషిమ్ – 3, ఎలీసా -1, సోర్ఫినా – 1 పరుగులు తీశారు.

శ్రీలంక బౌలర్లలో.. శశినీ 3 వికెట్లు, కావ్య కావింది – 2, దిల్హరి – 2, ప్రియదర్శిని, సచిని నిసంసల, అమ కాంచన తలో వికెట్ తీశారు.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×