BigTV English

DGP comments on Madanapalle incident: మదనపల్లె ఆర్డీవో ఆఫీసును పరిశీలించిన డీజీపీ.. ఏం చెప్పారంటే..?

DGP comments on Madanapalle incident: మదనపల్లె ఆర్డీవో ఆఫీసును పరిశీలించిన డీజీపీ.. ఏం చెప్పారంటే..?

DGP Dwaraka Tirumala Rao Comments on Madanapalle Fire Incident: ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన యాక్సిడెంట్ కాదని.. ఇన్సిడెంట్‌లా కనిపిస్తోందన్నారు.


‘గత రాత్రి 11.30 గంటలకు మదనపల్లె ఆర్డీవో ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగింది. సుమారుగా 3 గంటలపాటు పరిశీలించారం. ఇది యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్‌గా భావిస్తున్నాం. 22ఏ భూముల రికార్డులున్న గదిలో మంటలు చెలరేగాయి. కీలక సెక్షన్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, ఘటనకు సంబంధించిన సమాచారం ఆర్డీవోకు తెలిసింది.. కానీ, కలెక్టర్‌కు తెలియజేయలేదు. స్థానిక సీఐకి తెలిసినా కూడా డీఎస్పీ, ఎస్పీలకు సమాచారం ఇవ్వలేదు. ఈ పరిణామాలు అనుమానాలకు తావిస్తోంది. కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశమే లేదు. ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ వాళ్లు కూడా స్పష్టం చేస్తున్నారు.

Also Read: మదనపల్లె ఘటన విషయంలో పెద్దిరెడ్డిపైనే అనుమానంగా ఉంది: మంత్రి అనగాని


ఆర్డీవో ఆఫీసులో కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. ఆఫీసు బయట కూడా పలు ఫైల్స్ కాలిపోయినట్లు గుర్తించాం. ఇవన్నీ కూడా అనుమానాలను మరింత పెంచుతున్నాయి. ఇటీవల సాక్షాలను నాశనం చేసే ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా దర్యాప్తు ప్రారంభించాం. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు 10 బృందాలను ఏర్పాటు చేశాం’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×