BigTV English

Shikhar Dhawan: భారత క్రికెట్ లో నువ్వు ఒక శిఖరం.. ధావన్ రిటైర్మెంట్ పై ఎవరేమన్నారు?

Shikhar Dhawan: భారత క్రికెట్ లో నువ్వు ఒక శిఖరం.. ధావన్ రిటైర్మెంట్ పై ఎవరేమన్నారు?

Shikhar Dhawan: టీమ్ ఇండియా క్రికెట్ లో.. శిఖర్ ధావన్ ది ఒక శకం అని చెప్పాలి. సుమారు 13 ఏళ్లు భారత క్రికెట్ కు తను సేవలందించాడు. ఓపెనర్ గా వచ్చి ఎటాకింగ్ ప్లేకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. తను క్రీజులో ఉన్నాడంటే, ప్రత్యర్థులకి హడల్ అని చెప్పాలి. అసలు భయమన్నదే ఎరుగని క్రికెటర్ గా శిఖర్ ధావన్ పేరు తెచ్చుకున్నాడు. అలాంటి తను సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించేసరికి పలువురు సీనియర్ క్రికెటర్లు స్పందించారు. భారత క్రికెట్ లో నువ్వు ఒక శిఖరం అంటూ ఆకాశానికెత్తేశారు. ఇంతకీ వారేమన్నారంటే..


ముందుగా భారత కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ “నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నా ఇదే ఉత్సాహంతో పనిచేస్తావని, చేయాలని ఆశిస్తున్నాను. నువ్వు ఇంతకాలం భారత క్రికెట్ కు చేసిన సేవలు అద్భుతమైనవి.. నీ కెరీర్ కు అభినందనలు” అని తెలిపాడు.

ఇక డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ “ధావన్.. శుభాకాంక్షలు. నువ్వు కూడా మా టీమ్ లో జాయిన్ అవుతున్నావ్.. మొహలీలో ఆడేటప్పుడు నువ్వు నా స్థానంలో వచ్చావు. అప్పటి నుంచి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చావు. ఇక నుంచి కుటుంబ సభ్యులతో నీ జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను” అని తెలిపాడు.

భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మాట్లాడుతూ “నువ్వు రికార్డుల కోసం ఎప్పుడూ ఆడలేదు. ఎప్పుడు జట్టు గెలుపు కోసమే కష్టపడ్డావు. అదే నీ గొప్పతనం మిత్రమా.. నీకు అభినందనలు” అని తెలిపాడు.

Also Read: టీమిండియా ఆటగాడు శిఖర్‌ధావన్.. రిటైర్‌మెంట్ ప్రకటన.. కాకపోతే

ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. హ్యాపీ రిటైర్మెంట్ గబ్బర్ అంటూ రాసుకొచ్చారు. “నువ్వు పంజాబ్ కింగ్స్ కి అందించిన విజయాలు చిరస్మరణీయం. ఆ వేడుకలు ఇంకా మరిచిపోలేం. నువ్వు చేసిన పరుగులు, అందించిన ట్రోఫీలు, ఎన్నో జ్నాపకాలు పంజాబ్ కింగ్స్ ప్రయాణం నిండా ఉన్నాయి. నీ తర్వాత జీవితం మరింత అందంగా, అద్భుతంగా ఆనందమయం కావాలని కోరుకుంటున్నాను.”

బీసీసీఐ నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది. “నీ భవిష్యత్ జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటున్నాం. నువ్వు దేశవాళి, అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ కి చేసిన సేవలు మరిచిపోలేం. టీమ్ ఇండియా నుంచి ఒక మంచి క్రికెటర్ దూరమయ్యాడు.”

వీరే కాకుండా అభిమానులు కూడా నెట్టింట బాధాతప్త హృదయంతో పలు సందేశాలు రాస్తున్నారు. మొత్తానికి గబ్బర్ గా పిలుచుకునే ధావన్ మరి క్రికెట్ ప్రపంచంలోనే ఉంటాడా? సీనియర్ల తరహాలో మెంటర్ గా పనిచేస్తాడా? అనేది తేలాల్సి ఉంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×