BigTV English

Russian jail clashes :రష్యన్ జైలులోకొట్టుకున్న ఖైదీలు..ఎనిమిది మంది మృతి

Russian jail clashes :రష్యన్ జైలులోకొట్టుకున్న ఖైదీలు..ఎనిమిది మంది మృతి

ISIS prisoners killed after slashing guards, seizing hostages in Russian jail: రష్యా జైలులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ఆగంతకులు కత్తులు చేతపట్టి మారణహోమం సృష్టించారు. ఖైదీల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ అంతకంతకూ పెరిగిపోయింది. దీనితో వారిని అదుపు చేద్దామనుకున్న జైలు సిబ్బంది కూడా ముగ్గురు మృతి చెందారు. మొత్తం ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ ఘర్షణలో. ఐకె 19 సురోవికినో ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆ ప్రాంతమంతా అత్యంత భద్రత ఏర్పాట్లను కలిగి వుంటుంది. అనూహ్యంగా తోటి ఖైదీలపై కత్తులతో దాడులు చేసిన రష్యన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తాము ఐఎస్ఐకు సానుభూతి పరులమంటూ తమది ఇస్లామిక్ సంస్క్కృతి అంటూ తోటి ఖైదీలపై కత్తులతో ఎగబడ్డారు. జైలు అధికారులు ఖైదీలతో క్రమశిక్షణ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ముగ్గురు ఖైదీలు రెచ్చిపోయారు. కత్తులు చేతబట్టి వీరవిహారం చేశారు. అప్పటికే జైలులో కొంత భాగాన్ని తమ అదుపులోకి తెచ్చుకున్నారు.


వివక్ష చూపుతున్నారంటూ..

ముస్లింలను అణిచివేతలకు గురిచేస్తున్న రష్యా విధానాలపై వీరు ఆగ్రహించారు. జైలులోనూ తమపై వివక్ష చూపుతున్నారని..అందుకే తగిన గుణపాఠం చెప్పేందుకే ఈ దాడులు జరిపామని అంటున్నారు ఉగ్ర ఖైదీలు. వీరంతా ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ లకు చెందినవారిగా గుర్తించారు. ఇప్పటికే దాడులకు పాల్పడిన నలుగురు ఖైదీలను గుర్తించడం జరిగిందని జైలు అధికారులు చెబుతున్నారు. వారిలో రుస్తుమ్ చోన్ నవ్రూజీ, తైమూర్ ఖుసినోవ్, రామ్ జిడిన్ తోషోన్, నజిర్చోస్ తోషావ్ లను గుర్తించి వారి ఫొటోలను విడుదల చేశారు. పరిస్థితి మరింత జఠిలంగా మారడంతో రష్యన్ సాయుధ దళాలు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ దాడిలో కొందరికి తీవ్ర రక్తాస్రావం అయింది. ముఖం అంతా రక్తసిక్తమైన ఓ ఖైదీ ఫొటోని కూడా విడుదల చేశారు అధికారులు. ఓ టెర్రరిస్ట్ కత్తి పట్టుకున్న ఫొటోని కూడా విడుదలచేశారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. దాడులు చేసిన ఖైదీలంతా తాము ఐసిస్ కు విధేయులమంటూ ప్రతిజ్ణలు చేశారు.


Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×