BigTV English

IPL 2024 Dhoni New Jersey: ధోని జెర్సీ రిలీజ్.. చెన్నై ఫ్యాన్స్ హంగామా!

IPL 2024 Dhoni New Jersey: ధోని జెర్సీ రిలీజ్.. చెన్నై ఫ్యాన్స్ హంగామా!
CSK Unveiled No. 7 Jersey Ahead of IPL 2024

CSK Unveiled No. 7 Jersey Ahead of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌ మరికొద్ది నెలల్లో క్రీడాప్రేమికులను అలరించబోతుంది. పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో ఐపీఎల్‌కు ఉన్న కిక్కే వేరు. ఒకే దేశానికి చెందిన ఆటగాళ్లు ప్రత్యర్థులుగా మారి గెలుపు కోసం పోరాడుతుంటే ఆ మజానే వేరు. ఐపీఎల్‌లో అన్ని జట్ల ఫ్యాన్ బేస్ ఒకలా ఉంటే.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్ బేస్ విజిల్ పోడు అనేలా ఉంటుందనడంలే ఎలాంటి సందేహం లేదు.


దానికి కారణం లెజండరీ ఆటగాడు, తమిళులు ఆరాధ్యంగా పిల్చుకునే తలానే. ఎవరని అనుకుంటున్నారా. అతనే ఝార్ఖండ్ డైనమైట్.. మహేంద్ర సింగ్ ధోని. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ వస్తున్నాడు.

2023 ఐపీఎల్ ఫైనల్లో చెన్నై ఓడిపోయిన తర్వాత అందరికీ ఒకటే సందేహం. వచ్చే సీజన్‌లో ధోని ఆడతాడా లేదా అని. కానీ చెన్నై టీం మేనేజ్‌మెంట్ ధోని ఆడతాడన్న క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే ధోని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.


Read More: టీమిండియాకు గాయాల బెడద.. మూడో టెస్టుకు అయ్యర్ దూరం?

తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ట్విట్టర్ వేదికగా చెన్నై అభిమానులతో సీటీమార్ లాంటి వార్త పంచుకుంది. ధోని పేరుతో ఉన్న ఐకానిక్ నంబర్ 7 జెర్సీని ఆవిష్కరించింది. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. కాగా ఇతిహాడ్ ఎయిర్‌వేస్ స్పాన్సర్‌షిప్‌ను సీఎస్‌కే రివీల్ చేసింది.

కాగా ఇప్పటివరకు పద్నాలుగు సీజన్లు ఆడిన చెన్నై 12 సార్లు ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ 2024లో కూడా ప్లే ఆఫ్స్‌లోకి వెళ్లే సామర్ధ్యం ఉందని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అంచనా వేశారు. ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ స్ట్రాటజీ చూస్తే ఖచ్చితంగా మొదటి నాలుగు స్థానాల్లో ఉంటుందన్నారు. సీఎస్‌కే మిడిల్ ఆర్డర్ రాయుడు రిటైర్మెంట్ తర్వాత పటిష్టం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. వేలం తర్వాత టీమ్ బ్యాలెన్స్ సరిగ్గా ఉందని అన్నారు.

కాగా 2013 బెట్టింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సీఎస్కే టీమ్.. రెండేళ్ల పాటు సస్పెన్షన్‌కు గురైంది. 2016, 2017 సీజన్లలో చెన్నై టీమ్ ఆడలేదు. 2018లో తిరిగొచ్చిన ధోని సేన టైటిల్ ఎగరేసుకపోయింది.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×