BigTV English

 CSK vs GT ipl 2023 Final : గుజరాత్ వర్సెస్ చెన్నై… గెలుపెవరిది?

 CSK vs GT ipl 2023 Final : గుజరాత్ వర్సెస్ చెన్నై… గెలుపెవరిది?
CSK vs GT ipl 2023 Final

CSK vs GT ipl 2023 Final : నరేంద్ర మోదీ స్టేడియంలో విజేత ఎవరు? ఎవరి లెక్కలు వారికి ఉన్నాయ్. 2023 ఐపీఎల్ టైటిల్ పోరులో తలపడుతున్నది హేమాహేమీలు అని చెప్పలేం. చెన్నైకి మాత్రమే ఆ అర్హత ఉంది. అలాగని గుజరాత్ జట్టును తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఆ మాటకొస్తే 2023 టైటిల్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నది కూడా గుజరాత్ టైటన్స్‌కే.


డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ సీజన్‌ను గ్రాండ్‌గా ఓపెన్ చేసింది కూడా చెన్నైపై గెలుపుతోనే. ఆ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌లోనూ చెన్నైతోనే తలపడుతుండడం నిజంగా మిరాకిల్. మొత్తంగా ఈ సీజన్‌లో గుజరాత్, చెన్నై జట్లు రెండు సార్లు ఎదురుపడ్డాయి. రెండోసారి ప్లేఆఫ్స్‌లో ఈ రెండు జట్లు ఢీకొట్టాయి. ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లోలో ధోనీ సేన గుజరాత్ టైటాన్స్‌పై ప్రతీకారం తీర్చుకుంది.

సో, గుజరాత్, చెన్నై మధ్య పోటీ జరిగిన రెండు మ్యాచులలో ఒకటి గుజరాత్, మరొకటి చెన్నై గెలుచుకున్నాయి. మరి ఫైనల్ గెలిచేదెవరు? దీనిపైనే అభిమానులు లెక్కలేసుకుంటున్నారు. గుజరాత్‌కు ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన హిస్టరీ ఉంది. చెన్నై జట్టు ఓడుతూ గెలుస్తూ వచ్చినప్పటికీ… గెలవాల్సిన కీలక మ్యాచ్‌లలో అదరగొట్టేసింది.


ఇప్పుడున్న పరిస్థితుల్లో గుజరాత్ జట్టును ఓడించడం అంత ఈజీ కాదన్నది ఎక్స్‌పర్ట్స్ మాట. అలా అయితే ఫస్ట్ క్వాలిఫైయర్ మ్యాచ్ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్‌ను కూడా లెక్కలోకి తీసుకోవాలంటున్నారు గుజరాత్ ఫ్యాన్స్. ముఖ్యంగా శుభ్ మన్ గిల్, హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ స్కిల్స్ కారణంగా ఎడ్జ్ గుజరాత్ వైపే ఉంది. ఇక ఫైనల్ వరకు వచ్చిన చెన్నై జట్టును ఎంఎస్ ధోనీ అంత ఈజీగా ఓడిపోనివ్వడన్నది ఓ సెక్షన్ ఎక్స్‌పర్ట్స్ మాట. ఒకవేళ ఫైనల్‌లో ఓడిపోతే… ధోనీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనన్న కామెంట్స్ గట్టిగా వినిపించొచ్చు. సో, ఏ రకంగా చూసినా… రెండు జట్లు చాలా గట్టిగానే తలపడతాయన్నది రియల్. చూద్దాం గెలుపెవరిదో.

Related News

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Big Stories

×