MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 2007 వరల్డ్ టీ-20 ఛాంపియన్, 2011 వన్డే వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఇలా వరసగా విజయం సాధించిన జట్టుగా టీమిండియాని నిలిపాడు కెప్టెన్ ధోనీ. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపాడు. ఇలా చెబుకుంటూ పోతే ధోనీ ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన వారిలో ధోనీ ఒకడు. ముఖ్యంగా ధోనీ ఏం చేసినా ఇండియా కోసం చేస్తాడన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.
Also Read : Pant Run out : గాయంతోనే బ్యాటింగ్.. దారుణంగా పంత్ రనౌట్… Stupid అంటూ దారుణంగా ట్రోలింగ్
ధోనీ అద్భుతాలు..
తొలుత ధోనీ టికెట్ కలెక్టర్ గా పని చేశాడు. ఆ తరువాత ఫుట్ బాల్ ఆడాడు. ఆ తరువాత క్రికెట్ వైపు వచ్చి క్రికెట్ లో కీలక ప్లేయర్ గా మారాడు. ఫుట్ బాల్ గోల్ కీపర్ గా తన కెరీర్ ని ప్రారంభించాడు. క్రికెట్ లో వికెట్ కీపర్ గా అద్భుతంగా రాణించాడు. ప్రపంచంలో ఒక బెస్ట్ కీపర్ గా రాణించాడు. అయితే ఆస్ట్రేలియా.. భారత్ జట్ట మధ్య మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదిక గా బాక్సింగ్ డే టెస్టు జరుగుతోంది. కానీ అది భారత క్రికెటర్ ధోనీకి చివరి మ్యాచ్ అవుతుందని ఎవ్వరూ అస్సలు ఊహించలేదు. ఆ మ్యాచ్ ముగియగానే కెప్టెన్ కూల్ ధోనీ తన సుదీర్ఘ ఫార్మాట్ కి వీడ్కోలు చెప్పేశాడు. ఇక ఆ తరువాత వన్డేలు, టీ-20లకు సారథ్యం వహించినప్పటికీ.. కొద్ది రోజుల తరువాత వాటికి కూడా వీడ్కోలు చెప్పేశాడు. ప్రస్తుతం ధోనీ ఆర్మీ లోకి వెళ్లాడు. అందుకు సంబంధించిన ఫొటోలు దర్శనమిచ్చాయి. ధోనీ ఏం చేసినా ఇండియా కోసమేనని నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం.
ధోనీ రిటైర్మెంట్.. రాహుల్ ఎంట్రీ..
ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఆడుతున్నాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన మ్యాచ్ లోనే కేఎల్ రాహుల్ ఎంట్రీ ఇచ్చాడు. అతనితో పాటు మరొకరూ కూడా డెబ్యూ చేశాడు. కానీ అతను ఆస్ట్రేలియా తరపున ఆడాడు. అతని పేరు జో బర్న్స్.. కట్ చేస్తే.. 11 ఏళ్ల తరువాత కేఎల్ రాహుల్ భారత జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. కానీ ఆస్ట్రేలియా ఆటగాడు మాత్రం ఆరేళ్లకే టీమ్ లో చోటు కోల్పోయి క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అప్పుడు కేవలం 23 టెస్టులు మాత్రమే ఆడాడు. అయితే ఆస్ట్రేలియా కి రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడు.. ప్రస్తుతం ఇటలీ సరికొత్త చరిత్రకు అతని సారథ్యంలోనే నాంది పడింది. జోబర్న్స్ 2020లో ఆసీస్ జట్టుకు వీడ్కోలు పలికి.. 2025లో ఇటలీ సారథిగా ఆ జట్టును టీ-20 ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించేలా చేశాడు. యూరప్ రీజియన్ గురించి ఇటలీ బరిలోకి దిగింది. తొలిసారి పొట్టి క్రికెట్ కప్ టోర్నీకి అర్హత సాధించింది. ఈ విషయం విని అంతా ఆశ్చర్యపోవడం విశేషం.