BigTV English

Pant Run out : గాయంతోనే బ్యాటింగ్.. దారుణంగా పంత్ రనౌట్… Stupid అంటూ దారుణంగా ట్రోలింగ్

Pant Run out : గాయంతోనే బ్యాటింగ్.. దారుణంగా పంత్ రనౌట్… Stupid అంటూ దారుణంగా ట్రోలింగ్

Pant Runout : ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ 5 టెస్టు సిరీస్ ల మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishab Pant) దారుణంగా రనౌట్ అయ్యాడు. గాయం కారణంగా ఫీల్డింగ్ మధ్యలోనే రెస్ట్ తీసుకున్న పంత్.. గాయంతో ఉండి కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 74 పరుగులు చేసి సెంచరీ దిశగా ఉన్న సమయంలో అనవసరంగా రనౌట్ అయ్యాడు. లంచ్ విరామ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 65.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 284 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 387 పరుగులు చేసిన విషయం తెలిసిందే. లంచ్ కి ముందు రిషబ్ పంత్ ఔట్ కావడంతో నెటిజన్లు రిషబ్ పంత్ ను దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.


Also Read : KL Rahul Century : కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ… కానీ అంతలోనే

స్టుపీడ్.. స్టుపీడ్.. అంటూ కామెంట్స్ 


స్టుపీడ్.. స్టుపీడ్.. స్టుపీడ్(Stupid.. Stupid Stupid)  అంటూ రిషబ్ పంత్ పై కామెంట్స్ చేస్తున్నారు. లంచ్ కి ముందు రిషబ్ పంత్ ఔట్ అయితే.. లంచ్ తరువాత రెండు పరుగులు చేసి సెంచరీ చేసుకొని ఓపెనర్  కేఎల్ రాహుల్ (Kl Rahul)  ఔట్ కావడం విశేషం. ఇక ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో జో రూట్ 104, జెమీ స్మిత్ 51, బ్రైడన్ కార్స్ 56, హాప్ సెంచరీతో 112.3 ఓవర్లలో 387 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 74/5 అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. నితీశ్ కుమార్ రెడ్డి 62/2, మహ్మద్ సిరాజ్ 85/2 వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా 29/1  పోప్  44 ని ఔట్ చేశాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ (1/35) యశస్వీ జైస్వాల్ (13)ను ఔట్ చేయగా, బెన్ స్టోక్స్ (1/44) కరుణ్ నాయర్ (40) వికెట్ తీశాడు. క్రిస్ వోక్స్ (1/73) కెప్టెన్ శుభ్‌మన్‌గిల్ (16)ను పెవిలియన్‌కు పంపాడు. తాజాగా ఇవాళ రిషబ్ పంత్ రనౌట్ కాగా.. కేఎల్ రాహుల్ ని బషీర్ ఔట్ చేశాడు.

విజయం సాధించేది ఎవరో..? 

ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంకా 60 పరుగుల వెనుకంజలో టీమిండియా ఉంది. అయితే కొందరూ ఈ మ్యాచ్ పై కచ్చితంగా డ్రా అవుతుందని పేర్కొనడం గమనార్హం. టీమిండియా ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదిస్తుందనే ధీమాతో ఉన్నారు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో ఎన్ని పరుగులు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇంగ్లాండ్ తక్కువ స్కోర్ కే ఆలౌట్ అయితే టీమిండియా విజయం సాధిస్తుంది. ఎక్కువ స్కోర్ చేసిందంటే.. డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయని పలువురు క్రీడాభిమానులు అంచెనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధిస్తే.. రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడో టెస్టు హోరా హోరీగా కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో ఎవ్వరూ విజయం సాధిస్తారనేది ఇంకా ఆసక్తికరంగానే ఉండటం విశేషం. మూడు రోజులు అయినప్పటికీ ఇంకా విజయం పై ఇంకా స్పష్టత లేదు. టీమిండియా కే ఎక్కువ అవకాశాలున్నాయని కొందరూ అంటే.. ఇంగ్లాండ్ విజయం సాధిస్తుందనేది మరికొందరూ పేర్కొంటన్నారు. ఇవాళ మ్యాచ్ పూర్తయితే కానీ ఓ క్లారిటీ వస్తుంది.

Related News

Timed Out In KCL 2025 : గ్రౌండ్ లో అడుగుపెట్టకుండానే ఔట్ అయిన బ్యాట్స్మెన్… అప్పట్లో KCL లో అరుదైన సంఘటన.. మాథ్యూస్ తరహాలోనే

Shreyas Iyer – BCCI: శ్రేయాస్ అయ్య‌ర్ కు అదిరిపోయే ఆఫ‌ర్‌..బీసీసీఐ ప్లాన్ అదుర్స్‌.. ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే

Asia Cup 2025: దుబాయ్ లో అడుగుపెట్టిన టీమిండియా…జెర్సీలో ఈ మార్పు గ‌మ‌నించారా

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే

Ashwin-Babar : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?

Big Stories

×