BigTV English

David warner : డేవిడ్ వార్నర్ సంచలన ప్రకటన.. ఏంటంటే?

David warner : ఆస్ట్రేలియా తాజా మాజీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మళ్లీ ఒక సంచలన ప్రకటన చేశాడు. అదేమిటంటే టీ 20 నుంచి రిటైర్ అయిన తర్వాత, ఏ దేశానికైనా కోచ్ గా వెళతానని అన్నాడు. ఒకవేళ ఆ అవకాశం వెంటనే రాకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగ్.. (ఐపీఎల్) లో ఏదొక ఫ్రాంచైజీకి కోచ్ గా రావచ్చునని అంటున్నారు. ఎందుకంటే తనకి కూడా ఇండియాలో వీరాభిమానులు ఉన్నారు. ఇక్కడికి వచ్చాడంటే ‘పుష్ప ’లా మారిపోతాడనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక నుంచి మ్యాచ్ గెలిస్తే చాలు ‘తగ్గేదేలే’ అంటాడని అంటున్నారు.

వార్నర్ ఏం చెప్పినా ఆసక్తికరంగానే ఉంటుంది. క్రికెట్ ఆస్ట్రేలియాకి ఒక ఆఫర్ కూడా వార్నర్ ఇచ్చాడు. అదేమిటంటే మరో రెండేళ్లలో ఆస్ట్రేలియా జట్టుకి సరైన ఓపెనర్ లేకపోతే, తన సేవలు అవసరమైతే తప్పకుండా వస్తానని, అప్పుడింకా కష్టపడి ఆడతానని తెలిపాడు. అంటే తన ప్లేస్ ని, మరో రెండేళ్లు కర్చీఫ్ వేసి పెట్టుకున్నాడు. అయితే అంత అవసరమైతే రాకపోవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లు చాలామంది ఉన్నారు.

కోచ్ గా వెళ్లాలని నిర్ణయం తీసుకున్న తర్వాత తన భార్యతో సంప్రదించానని తెలిపాడు. నేను కొన్ని రోజులు మళ్లీ కుటుంబానికి అందుబాటులో ఉండకపోవచ్చునని చెప్పానని అన్నాడు. అందుకు ఆమె కూడా అంగీకరించిందని తెలిపాడు. కోచ్ గా కెరీర్ ని ఎంచుకోవాలనేది నా చిరకాల కోరిక అని తెలిపాడు.

నా కెరీర్ లో ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని అన్నాడు. అయితే ఆట కోసం తీవ్రంగా శ్రమించానని, జట్టు కోసం అంకితభావంతో పనిచేశానని అన్నాడు. మొదట్లో చాలా దూకుడుగా ఉండేవాడిని, రాన్రాను దెబ్బలు తగిలాయి, అనుభవాలు పెరిగాయి, దాంతో ఆటిట్యూడ్ ఛేంజ్ చేశానని చెప్పుకొచ్చాడు.

కోపం ప్లేస్ లో చిరునవ్వు వచ్చింది. ఇప్పుడు నా లైఫ్ స్టయిల్ మారిపోయింది. నా చుట్టూ ఒక మంచి వాతావరణం ఏర్పడింది. మంచి స్నేహితులు, అభిమానించే ఫ్యాన్స్ వచ్చారు. నేను బాధపడితే అయ్యో అంటున్నారని అన్నాడు. ఒక నెగిటివ్ ప్రపంచం నుంచి పాజిటివ్ ప్రపంచంలోకి వచ్చానని తెలిపాడు. దీనిని అందరూ పాటించాలి, అంతా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి, ఇదే నా థియరీ అని తెలిపాడు. మరి కోచ్ గా వచ్చిన తర్వాత ఆ జట్టులో కూడా ఇలాగే ఆనందాన్నిఅందరికీ పంచుతాడని ఆశిద్దాం.

Related News

Harbajan Singh: ఇండియన్ ఆర్మీని చంపిన పాకిస్తాన్ కొడుకులతో క్రికెట్ ఆడుదామా..? బీసీసీఐకి హర్భజన్ వార్నింగ్

Liam Livingstone: 4,6,6,6,4 తో ఊచకోత… రషీద్ ఖాన్ ఇజ్జత్ తీసిన లివింగ్ స్టన్

Women’s ODI World Cup : మహిళల ప్రపంచ కప్ లో కూడా ఆస్ట్రేలియా డామినేట్.. ఈ లెక్కలు చూస్తే వణుకు పుట్టాల్సిందే

Kashish Kapoor : ఒక నైట్ కు వస్తావా? అని అడిగాడు… టీమిండియా క్రికెటర్ పై హాట్ బ్యూటీ సంచలన ఆరోపణలు!

Women’s World Cup 2025 : చిన్నస్వామిలో మ్యాచ్ లు బ్యాన్.. తిరువనంతపురంకు షిఫ్ట్.. షాక్ లో RCB!

Kohli Beard : కోహ్లీకి తెల్ల గడ్డం… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న అనుష్క శర్మ !

Big Stories

×