BigTV English

Winter Food : చలికాలం.. వీటి జోలికి అస్సలు పోకండి..!

Winter Food : చలికాలం అనేక వ్యాధులకు స్వాగతం పలుకుతుంది. ఈ కాలంలో ఏ మాత్రం ఏమరుపాటున ఉన్నా రోగాలు చట్టుముట్టుతుంటాయి. ఎప్పుడు ఏ వ్యాధి చుట్టుముడుతుందో అర్థం కాదు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతుంది

Winter Food : చలికాలం.. వీటి జోలికి అస్సలు పోకండి..!

Winter Food : చలికాలంలో అనేక వ్యాధుల ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ కాలంలో ఏ మాత్రం ఏమరుపాటుతో ఉన్నా రోగాలు చట్టుముడతాయి. ఎప్పుడు ఏ వ్యాధి చుట్టుముడుతుందో అర్థం కాదు. అందుకే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు వహించాలి. మీ లైఫ్ హెల్తీగా ఉండాలంటే.. చలికాలంలో కొన్ని ఆహారాల జోలికి వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.


చల్లని పదార్థాలు: కాలం ఏదైనా సరే మనలో చాలా మందికి కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ తదితర చల్లని పదార్థాలు తినడం అమితంగా ఇష్టం. కానీ ఈ కాలంలో దూరంగా ఉండాల్సిన పదార్థాలలో కూల్‌డ్రింక్స్ మొదటి స్ధానంలో ఉంటాయి. ఎందుకంటే కూల్ ‌డ్రింక్స్‌‌లో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. చలికాలంలో చల్లని పదార్థాలు తినడం చాలా డేంజర్. చల్లని పదార్థాలు తింటే జీర్ణం కావడానికి చాలా టైమ్ పడుతుంది. ఇవి మీ ఇమ్యూనిటీని దెబ్బతీసి.. దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల్లో సమస్యలను కలిగిస్తాయి.

వేయించిన ఆహారం : చలి కాలంలో ప్రతి ఒక్కరికి వేడి వేడిగా తినాలిని ఉంటుంది. ఎందుకంటే అలా వేయించిన ఆహారం తింటే ఆ కిక్కే వేరు. ముఖ్యంగా పకోడీలు, మిరపకాయ బజ్జీలు, సమోసా వంటివి వేడి వేడిగా తింటే ఆ మజానే వేరుంటుంది. కానీ చలికాలంలో ఇలాంటి ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వేయించిన ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వేయించిన ఆహారం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది.


కేఫిన్ పానీయాలు: కూల్‌డ్రింక్స్, కాఫీ, టీ వంటి పానియాలకు చలికాలంలో దూరంగా ఉంటే ఆరోగ్యానికి చాలా మేలు. ఎందుకంటే కేఫిన్ అత్యధికంగా ఉన్న ఆహారం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే ఛాన్స్ ఉంది. కాఫీ, టీ వంటివి వీలైనంత తక్కువగా తీసుకోవాలి.

జంక్‌ఫుడ్ : చాలా మందికి బర్గర్లు, పిజ్జాలు, చైనీస్ ఫ్రైడ్ ఐటెమ్స్ వంటి జంక్‌ఫుడ్ తినడం అలవాటుగా మారింది. టైమ్‌పాస్ కోసం యువత ఎక్కువగా జంక్‌ఫుడ్‌ను తింటున్నారు. ఈ ఫుడ్‌లో ఎటువంటి పోషక విలువలు ఉండవు. ఇవి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్, టాక్సిన్‌లను ఎదుర్కొనే ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. జంక్‌ఫుడ్ మీకు తినడానికి రుచిగా అనిపించినా.. ఎటువంటి పోషకాలను అందించవు.

పచ్చికూరగాయలు : పచ్చికూరగాయలు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. వీటిలో పోషకాలు ఉన్నప్పటికీ.. చలికాలంలో తింటే జీర్ణం కావడానికి చాలా టైమ్ పడుతుంది. అంతే కాకుండా పచ్చి ఆహారం శరీరంలో బ్యాక్టీరియాను, పరాన్నజీవులను పెంచే ప్రమాదం లేకపోలేదు. చలికాలంలో వెచ్చని ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ డీ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

గమనిక: పైన పేర్కొన అంశాలు పలు అధ్యయనాలు,హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారం మాత్రమే.

Related News

Gautami Chowdary: గౌతమ్‌ చౌదరికి అంబర్‌పెట్‌ శంకర్‌ మద్దతు.. లైవ్‌లో అసలు నిజం బట్టబయలు..

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

Big Stories

×